Assault: క్లబ్‌లో గొడవ, రియాలిటీ షో నటిపై ఘోరంగా దాడి- విరిగిన పన్ను, కమిలిపోయిన మొహం- వణికిపోతూ ప్రీత్ సింగ్ ఆవేదన!
Splitsvilla 16 Preet Singh Assaulted: ప్రముఖ రియాలిటీ షో స్ల్పిట్ల్ విల్లా సీజన్ 16 కంటెస్టెంట్, నటి ప్రీత్ సింగ్‌పై ఓ క్లబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆమె పన్ను విరగడమే కాకుండా, కళ్లు వాచిపోయి ముఖం కమిలిపోయింది. అయితే దాడి చేయించింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమె తెలిపింది.
Splitsvilla 16 Preet Singh Assaulted: ముంబై అంటేనే అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ధైర్యంగా తిరిగే నగరం అని పేరు. కానీ, అటువంటి నగరంలోనే ఇప్పుడు ఒక నటిపై దారుణమైన దాడి జరగడం కలకలం రేపుతోంది. ఎమ్‌టీవీ పాపులర్ షో 'స్ల్పిట్స్ విల్లా సీజన్ 16' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రీత్ సింగ్. అయితే, తాజాగా తనపై జరిగిన దాడి తాలూకు దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రీత్ సింగ్.

అకస్మాత్తుగా మొదలైన గొడవ
ముఖంపై కమిలిన గాయాలు, వాచిపోయిన కళ్లతో ఉన్న తన వీడియోను చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పూర్తి వివరాలను వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక క్లబ్‌లో సరదాగా గడుపుతుండగా, ఒక అమ్మాయి అకస్మాత్తుగా వచ్చి గొడవ మొదలుపెట్టిందని ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
"అసలు మిమ్మల్ని లోపలికి ఎలా రానిచ్చారు?" అంటూ సదరు యువతి అసభ్య పదజాలంతో దూషించిందని ప్రీత్ సింగ్ వివరించారు. మాట మాట పెరగడంతో ఆ యువతితో ఉన్న ఒక వ్యక్తి జోక్యం చేసుకుని, దారుణంగా కొట్టినట్లు ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విరిగిన పన్ను.. వణుకుతున్న నటి
ఈ దాడిలో ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ముఖంపై బలంగా కొట్టడంతో ఒక పన్ను విరిగిపోయిందని, కళ్లు వాచిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. "ముంబై నగరం అమ్మాయిలకు సురక్షితమని ఎప్పుడూ వింటూ ఉండేదాన్ని. కానీ నా విషయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా రాస్తున్నప్పుడు కూడా నా శరీరం వణుకుతోంది" అని ప్రీత్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అక్కడున్న వారు అడ్డుకోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని, దాడికి దిగిన ఆ యువతి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని తనకు తర్వాత తెలిసిందని ప్రీత్ సింగ్ వెల్లడించారు. అయితే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరును మాత్రం ప్రీత్ సింగ్ బయటపెట్టలేదు.
స్ల్పిట్స్ విల్లా మిత్రుల మద్దతు
ప్రీత్ సింగ్ పెట్టిన పోస్ట్‌పై ఆమె తోటి స్ల్పిట్స్ విల్లా కంటెస్టెంట్స్ స్పందిస్తున్నారు. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఒక పీడకల లాంటిదని జలక్ గోహిల్ కామెంట్ చేశారు. రురు ఠాకూర్, హిమాన్షు అరోరా వంటి వారు కూడా ప్రీత్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనపై ప్రీత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సన్నీ లియోన్, కరణ్ కుంద్రా హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న స్ల్పిట్స్ విల్లా-16లో ప్రీత్ సింగ్ కొన్ని ఎపిసోడ్ల క్రితమే ఎలిమినేట్ అయ్యారు.
సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే
ముంబై లాంటి నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతున్న తరుణంలో, సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ప్రీత్ సింగ్ ఎవరు?
ప్రీత్ సింగ్ ఎమ్‌టీవీలో ప్రసారమయ్యే 'స్ల్పిట్స్ విల్లా సీజన్ 16'లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆమె మోడల్, సోషల్ మీడియా సెలబ్రిటీ.
2. దాడి ఎక్కడ జరిగింది?
ముంబైలోని ఒక ప్రైవేట్ క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆమె స్నేహితుడు ఈ దాడికి పాల్పడ్డారని ప్రీత్ ఆరోపించారు.
3. ఆమెకు ఎలాంటి గాయాలయ్యాయి?
ఈ దాడిలో ప్రీత్ సింగ్ పన్ను విరిగిపోయింది, ముఖంపై తీవ్రమైన వాపు, కళ్ల కింద కమిలిన గాయాలయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


