OTT Crime: ఓటీటీలోకి వచ్చిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- ప్రాణాలు దక్కించుకునేందుకు ఒకరినొకరు చంపుకునే పోలీసులు- ఎక్కడంటే?
Shesha 2016 OTT Streaming: సస్పెన్స్, రివేంజ్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం సరికొత్త మిస్టరీ డ్రామా శేష 2016 ఓటీటీలోకి వచ్చేసింది. తమ ప్రాణాలను దక్కించుకునేందుకు ఒకరినొకరు చంపుకునే కథతో తెరకెక్కిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ శేష 2016 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Revenge Crime Thriller Shesha 2016 OTT Streaming: ఓటీటీ ప్రేక్షకులకు సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లంటే ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. స్క్రీన్ ముందుకు రాగానే సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఓటీటీ చిత్రాల కోసం సినీ ప్రియులు నిరంతరం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే సరికొత్త కథాంశంతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'శేష 2016'.

పోలీస్ డిపార్ట్‌మెంట్ చీకటి కోణం
టాలీవుడ్‌లో 'దృశ్యం' లేదా 'హిట్' లాంటి ఇన్వెస్టిగేషన్, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్లకు ఆదరణ చాలా ఎక్కువ. అదే కోవలో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ, ఒకే రాత్రిలో జరిగే కథతో శేష 2016 చిత్రాన్ని ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
ఆ ఒక్క రాత్రి.. అవినీతి ఖాకీల అంతం!
చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీస్ అధికారులు తమ స్వార్థం కోసం వ్యవస్థను ఎలా వాడుకున్నారనే పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. లంచాలు, అధికార దుర్వినియోగం, ఇల్లీగల్ సెటిల్‌మెంట్లు, కస్టడీ హింస వంటి దారుణాలకు ఒడిగడుతూ తాము అజేయులమని భావించే కొందరు పోలీసుల జీవితాల్లో ఒక తుఫాను రాత్రి ఊహించని విపత్తును తెస్తుంది.
ఆ రాత్రి వేళ ఒక అపరిచిత వ్యక్తి ఆ పోలీసులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేయడం మొదలుపెడతాడు. మొదట్లో ఇది సాధారణ దాడి అనుకున్నప్పటికీ, అది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ప్రతీకార చర్య అని వారికి అర్థమవుతుంది.
అనుమానం.. భయం.. ప్రాణ సంకటం!
బయట భారీ వర్షం, లోపల కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అవ్వడంతో ఆ పోలీసుల్లో తీవ్ర భయాందోళనలు మొదలవుతాయి. తదుపరి బాధితుడు ఎవరనే భయం వారిని వెంటాడుతుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి, ప్రాణాలు దక్కించుకోవడానికి ఒకరినొకరు చంపుకునే స్థితికి చేరుకుంటారు.
కేవలం శారీరక దాడులు మాత్రమే కాకుండా, మానసిక సంఘర్షణ (Psychological Suspense) ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో తాము చేసిన తప్పులు, అమాయకుల ప్రాణాలు బలిగొన్న సంఘటనలు ఫ్లాష్‌బ్యాక్ రూపంలో వారి కళ్ల ముందే కదలాడుతుంటాయి.
కర్మ సిద్ధాంతం.. తప్పించుకోలేరు!
కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ అపరిచిత హంతకుడు ఎవరు? పోలీసులపై అతనికి ఉన్న పగ ఏంటి? అనే ట్విస్టులు వీక్షకులను థ్రిల్ చేస్తాయి. తాము చేసిన తప్పులే తమ పతనానికి కారణమనే చేదు నిజం ఆ అధికారులకు ఎలా బోధపడిందనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు.
క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను సమపాళ్లలో కుదిర్చి ఈ మిస్టరీ డ్రామాను రూపొందించారు. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వకూడని చిత్రాల జాబితాలో శేష 2016 సినిమా నిలుస్తుంది. అలాంటి శేష 2016 ఓటీటీలోకి వచ్చేసింది.
సన్ నెక్ట్స్ ఓటీటీలో
సన్ నెక్ట్స్‌లో శేష 2016 ఓటీటీ రిలీజ్ అయింది. మే 22 నుంచి సన్ నెక్ట్స్‌లో శేష 2016 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కన్నడ, మలయాళం వంటి రెండు భాషల్లోనే శేష 2016 ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. తెలుగులో శేష 2016 ఓటీటీలో అందుబాటులో లేకపోవడం ఒకింత మైనస్ అని చెప్పుకోవచ్చు. కానీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రం శేష 2016 మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


