Drishyam 3 X Review: దృశ్యం 3 ట్విటర్ రివ్యూ- ట్విస్టులతో ఊపిరిబిగబట్టే క్లైమాక్స్- మోహన్ లాల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే?

Mohanlal Drishyam 3 Twitter Review In Telugu: భారతీయ చలనచిత్ర రంగంలోనే క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న దృశ్యం మూడో భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ థ్రిల్లర్ డ్రామా దృశ్యం 3 ట్విటర్ రివ్యూపై లుక్కేద్దాం.

Published on: May 21, 2026, 10:06:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mohanlal Drishyam 3 Twitter Review In Telugu: సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'దృశ్యం 3' (Drishyam 3) మే 21, 2026న అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

దృశ్యం 3 ట్విటర్ రివ్యూ- ట్విస్టులతో ఊపిరిబిగబట్టే క్లైమాక్స్- మోహన్ లాల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే?
దృశ్యం 3 ట్విటర్ రివ్యూ- ట్విస్టులతో ఊపిరిబిగబట్టే క్లైమాక్స్- మోహన్ లాల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే?

అసలైన వినోదం

జార్జ్‌కుట్టి, అతని కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథనం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ రోజు వెండితెరపై అసలైన వినోదం మొదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన రీమేక్‌లు 'దృశ్యం', 'దృశ్యం 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈ మలయాళ ఒరిజినల్ వెర్షన్ మూడో భాగంపై మన తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దృశ్యం 3 ట్విటర్ రివ్యూపై లుక్కేద్దాం.

సోషల్ మీడియాలో 'దృశ్యం 3' హవా..

ఉదయం ఆటలు ముగిసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రేక్షకులు తమ స్పందనలను పంచుకుంటూ దృశ్యం 3పై రివ్యూలు ఇస్తున్నారు. సినిమా ఫస్టాఫ్ నుంచే కథనంలో వేగం పెరిగిందని, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్ల రివ్యూలు ఇవే!

మలయాళంలో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి చర్చ సహజమే అయినప్పటికీ, జార్జ్‌కుట్టి కొత్త వ్యూహాలపై వస్తున్న రెస్పాన్స్ సరికొత్త రికార్డులను సృష్టించేలా ఉంది. "జార్జ్‌కుట్టి ఈసారి వేసిన ప్లాన్ మునుపటి రెండు భాగాల కంటే అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊపిరి బిగబట్టేలా చేస్తుంది" అని థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

"దృశ్యం 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి, ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సాధించింది. ఇప్పుడు దృశ్యం 3 అంతకు మించి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది కేవలం ప్రాథమిక స్పందన మాత్రమేనని, రోజు గడిచేకొద్దీ పూర్తి స్థాయి రివ్యూలు వస్తేనే సినిమా అసలు ఫలితంపై స్పష్టత వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో కొత్త చిక్కులో జార్జ్‌కుట్టి.. ఈసారి కథేంటంటే?

'దృశ్యం 3' కథ మునుపటి భాగాల కంటే భిన్నంగా, మరింత ఎమోషనల్‌గా సాగుతుందని మే 9న విడుదలైన ట్రైలర్‌తోనే చిత్రబృందం హింట్ ఇచ్చింది. గతంలో చేసిన తప్పుల వల్ల జార్జ్‌కుట్టి కుటుంబం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది, సత్యాన్ని కాపాడుకోవడానికి అతను ఆడిన సరికొత్త మైండ్ గేమ్ ఏంటనేది ఈ భాగంలో చూపించారు.

అద్భుతమైన సాంకేతిక హంగులు

మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపి తమ పాత పాత్రల్లోనే మరోసారి జీవించారు. ఈ చిత్రానికి సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించగా, వినాయక్ వి.ఎస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సీన్లను మరింత రక్తికట్టించిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

ప్రశాంత్ మాధవ్ ప్రొడక్షన్ డిజైన్, సినోయ్ జోసెఫ్ సౌండ్ డిజైన్ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఇప్పటికే వివిధ భారతీయ భాషల్లో రీమేక్ అయి సంచలనం సృష్టించిన ఈ మోహన్ లాల్ ఫ్రాంచైజీ, ఇప్పుడు ఈ మూడో భాగంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More