Harudu Review: హరుడు రివ్యూ- దశాబ్దం తర్వాత హీరో వెంకట్ రీ ఎంట్రీ మూవీ- పోలీస్ డ్రామా మెప్పించిందా?
Harudu Movie Review In Telugu And Rating: కథానాయకుడు వెంకట్ దశాబ్దం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ హరుడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హరుడు సినిమాలో హెబ్బా పటేల్, నటాషా సింగ్, సలోని నటించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి హరుడు రివ్యూలో తెలుసుకుందాం.
Harudu Review Telugu And Rating: ఒకప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’ ‘ఆనందం’ ‘శివరామరాజు’ వంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో వెంకట్. ఇటీవల పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో నటించిన వెంకట్ హీరోగా దశాబ్దకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా హరుడు.

హరుడు రివ్యూ
తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన హరుడు సినిమాలో వెంకట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన హరుడు ఇవాళ (మే 15) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి హరుడు రివ్యూలో చూద్దాం.
టైటిల్: హరుడు
నటీనటులు: వెంకట్, హెబ్బా పటేల్, నటాషా సింగ్, సలోని, వేద్విక సోనీ, సుమన్, అలీ తదితరులు
దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
సంగీతం: మణిజెన్నా
సినిమాటోగ్రఫీ: ఆనంద్ మరుకుర్తి
ఎడిటింగ్: ఉప్పు మారుతి
నిర్మాతలు: డిక్కల లక్ష్మణరావ్, ప్రవీణ్ రెడ్డి వి
బ్యానర్: వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేది: మే 15, 2026
కథ:
ముంబై మాఫియాను గడగడలాడించిన డీసీపీ శంకర్ అలియాస్ ఎన్‌కౌంటర్ శంకర్ (వెంకట్) హైదరాబాద్ సిటీకి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. నగరంలో క్రిమినల్స్‌ను తన స్టైల్‌లో పట్టుకునే పనిలో ఉన్న శంకర్‌కు ఓ కేసు విషయంలో ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా) తారసపడతాడు. ముఖ్యమంత్రి (సుమన్)నే ప్రశ్నించే ధైర్యవంతుడైన స్వతంత్ర ఎమ్మెల్యేగా అతనికి మంచి పేరు ఉంటుంది.
మరోవైపు నిరుద్యోగులైన కొందరు విద్యార్థులు తమ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు కార్ల ఇంజిన్లు దొంగతనం చేసి దొరికిపోతారు. వారిని ఎమ్మెల్యే విడిపించిన వెంటనే ఆ విద్యార్థులపై దాడి జరుగుతుంది. అది చేయించింది ఎమ్మెల్యే వరదరాజులు అని శంకర్‌కు తెలుస్తుంది.
ఆ తర్వాత ఏమైంది అసలు వరదరాజులు రాజకీయం ఏంటీ విద్యార్థులు దొంగతనం చేసిన ఇంజిన్లకు వరదరాజులకు సంబంధం ఏంటీ? ఆ స్టూడెంట్స్ ఎందుకు దొంగతనం చేశారు? ముంబై డాన్ రాజన్ (రవివర్మ) ఈ గొడవలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) ఎలా చనిపోయింది? చివరికి శంకర్ ఈ నేర సామ్రాజ్యాన్ని ఎలా అంతం చేశాడు? అనేదే హరుడు సినిమా.
విశ్లేషణ:
హురుడు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓ పోలీస్ వర్సెస్ నేర చరిత్ర గల రాజకీయవేత్త వంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అలాంటి ఫార్మాట్‌లోనే సాగుతుంది. అక్కడక్కడ యువత డబ్బు కోసం పెడదారి ఎలా పడుతున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. స్టోరీ కొంత రోటీన్‌గా అనిపించిన సీన్లతో ఎంగేజ్ చేసి పర్వాలేదనిపించారు.
అయితే, పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏం కనిపించవు. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఆడియెన్స్ ఊహించేలాగే ఉంటుంది. అది సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాత్రం కమర్షియల్ అంశాల్ని, లెక్కల్ని అన్నీ చూసుకుని పాటలు, ఫైట్స్, కామెడీ సీన్స్ రాసుకుంటూ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఆకట్టుకునే ఇంటర్వెల్ ట్విస్ట్
హీరో పరిచయం, నగరంలో నేరాలు, విద్యార్థుల కారు ఇంజిన్ల దొంగతనం ఇలా ఫాస్ట్‌గా సాగుతాయి. కానీ, ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ కీలకంగా ఉంటుంది. అందులో హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ బాగుంటుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్లు కొంత స్పీడ్‌గా సాగుతూ మెప్పిస్తాయి. క్లైమాక్స్ అందరి ఊహించినట్లుగానే ఉంటుంది. రన్ టైమ్ తక్కువగా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఇక సినిమాలో విజువల్స్ బాగున్నాయి. సంగీతం, పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి టేకింగ్ పర్వాలేదు. కానీ, ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. చాలా ఏళ్ల విరామం తర్వాత వెంకట్ హీరోగా వెండితెరపై కనిపించడం ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే విషయం.
గ్లామర్‌తో అట్రాక్ట్
డీసీపీ పాత్రలో వెంకట్ గంభీరంగా బాగానే కనిపించారు. యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. నటాషా సింగ్ పాత్ర తక్కువ ఉన్న గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర మెప్పించేలా ఉంది. శ్రీహరి పైలా విలనిజం కూడా బాగానే ఆకట్టుకుంటుంది. అలీ కామెడీ, ఐటమ్ సాంగ్‌లో కనిపించిన సలోని కూడా తన గ్లామర్‌తో ఇంప్రెస్ చేశారు.
ఇక మిగిలిన పాత్రల్లో షానీ, వేద్విక, రవిందర్ వంటి వారు తమ నటనతో మెప్పించారు. సినిమాలోని సుమన్ వంటి ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు అలరిస్తాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే
పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ, కమర్షియల్ అంశాలు, ఫైట్ సీక్వెన్స్‌తో హరుడు పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


