Hebah Patel: టాలీవుడ్‌లో దూసుకుపోతున్న హెబ్బా పటేల్- మరో కొత్త సినిమాతో బ్యూటీ- దర్జా డైరెక్టర్ దర్శకత్వంలో అలా!

Hebah Patel New Movie With Chitralaya Creations: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దర్జా డైరెక్టర్ మ్యాక్ (సలీం) దర్శకత్వం వహించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Published on: Mar 14, 2026, 14:34:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటిపుల్ హీరోయిన్ హెబ్బా పటెల్. ఇటీవలే ఓ సినిమాను కమిట్ అయిన హెబ్బా పటెల్ మరో మూవీతో అలరించేందుకు రెడీ అయింది. అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీలక్ష్మీ.ఎం నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 3 రూపుదిద్దుకుంటోంది.

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న హెబ్బా పటేల్- మరో కొత్త సినిమాతో బ్యూటీ- దర్జా డైరెక్టర్ దర్శకత్వంలో అలా!
టాలీవుడ్‌లో దూసుకుపోతున్న హెబ్బా పటేల్- మరో కొత్త సినిమాతో బ్యూటీ- దర్జా డైరెక్టర్ దర్శకత్వంలో అలా!

దర్జా డైరెక్టర్ మ్యాక్

ఈ సినిమాకి ‘దర్జా’ ఫేమ్ మ్యాక్ (సలీం) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలోనే హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు మేకర్స్.

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలు

ఈ మేరకు నటీనటులు, ఇతర సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రకటించారు. ‘దర్జా’ మూవీతో అందరినీ మెప్పించిన మ్యాక్ (సలీం) ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా

ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునే దర్శకుడు మ్యాక్ (సలీం) ఈ సారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి మాటలు, పాటల్ని భాష్యశ్రీ అందించనున్నారు. కేవీఆర్ అడిషనల్ స్క్రీన్ ప్లేని రాశారు. ఎం. సమీర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు.

ఇటీవలే ఆ మూవీ ఫస్ట్ లుక్

ఈ సినిమాకు విష్ణు పానికర్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్ నటించనున్నారు. మిగిలిన వివరాల్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

రేపు ఉదయం పది గంటలకు నటీనటులు

'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో హెబ్బా పటేల్‌తోపాటు చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు.

మ్యారియో ఓటీటీ స్ట్రీమింగ్

కాగా ఇటీవలే మ్యారియో సినిమాతో అలరించిన హెబ్బా పటేల్ గతేడాది ఈషా, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, థ్యాంక్యూ డియర్, ఓదెల 2, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలతో ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలలో మ్యారియో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక్క డ్రగ్-3 కోరికలు

బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మ్యారియో సినిమాలో హెబ్బా పటేల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ పాత్రలో నటించింది. ఒక డ్రగ్ తీసుకుంటే విపరీతంగా పుట్టే 3 కోరికల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇలా వరుస సినిమాలతో హెబ్బా పటేల్ టాలీవుడ్‌లో దూసుకుపోతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More