Venkat: హరుడు పూర్తి చేయడానికి నటనతోపాటు నిర్మాత బాధ్యతలు తీసుకున్నా, విలన్‌గా అతన్ని పరిచయం చేస్తున్నాం: హీరో వెంకట్

Hero Venkat Speech At Harudu Trailer Launch: టాలీవుడ్ హీరో వెంకట్ కమ్‌బ్యాక్ ఇస్తున్న లేటెస్ట్ మూవీ హరుడు. ఈ సినిమాకు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించారు. మే 8న విడుదల కానున్న హరుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వెంకట్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

Published on: Apr 13, 2026, 21:42:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hero Venkat Comments: శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్‌టైనర్ ‘హరుడు’.

హరుడు పూర్తి చేయడానికి నటనతోపాటు నిర్మాత బాధ్యతలు తీసుకున్నా, విలన్‌గా అతన్ని పరిచయం చేస్తున్నాం: హీరో వెంకట్
హరుడు పూర్తి చేయడానికి నటనతోపాటు నిర్మాత బాధ్యతలు తీసుకున్నా, విలన్‌గా అతన్ని పరిచయం చేస్తున్నాం: హీరో వెంకట్

సమ్మర్ స్పెషల్‌గా

ఈ సినిమాకు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హరుడు గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా మే 8న హరుడు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హరుడు ట్రైలర్ లాంచ్‌లో హీరో వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు

హీరో వెంకట్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మీడియా మిత్రులని కోరుతున్నాను" అని అన్నారు.

విలన్‌గా శ్రీహరి పైలా

"చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్‌గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నాం. దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది" అని హీరో వెంకట్ తెలిపారు.

మంచి యాక్షన్ ఎపిసోడ్స్

"మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఒక రొమాంటిక్ సాంగ్‌ను గోవాలో షూట్ చేశాం ఆ పాట చాలా బాగా వచ్చింది. రిలీజ్ తర్వాత అది ఇంకా హిట్ అవుతుంది. హైదరాబాద్‌‌లో మాస్ సాంగ్ కూడా చిత్రీకరించాం అది థియేటర్లలో అలరిస్తుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గోవా, ముంబైలో పాటలు చిత్రీకరించాం" అని వెంకట్ పేర్కొన్నారు.

నన్ను యాక్షన్ హీరోలా చూపించారు

"మంచి బడ్జెట్‌తో, మంచి లొకేషన్స్‌లో సాంగ్స్ తీశాం. మా డిఓపీ ఆనంద్ చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్. మే 8న విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఆశీర్వాదాలు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ" అని తన స్పీచ్ ముగించాడు హీరో వెంకట్.

ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం

డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది పూర్తిగా టీమ్ వర్క్. ఈ సినిమా కోసం వెంకట్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ముంబైలో ఐదు రోజుల షూటింగ్ చాలా మంచి అనుభవం" అని చెప్పారు.

కథ మీద నాకు నమ్మకం ఉంది

"హెబ్బా పటేల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మా డైరెక్షన్ టీమ్‌కు ధన్యవాదాలు. కథ మీద నాకు నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను. థాంక్యూ" అని దర్శకుడు రాజ్ తాళ్లూరి వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More