జులపాల జుట్టుతో రాజ్ తరుణ్- వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రామ్ భజరంగ్ గ్లింప్స్ రిలీజ్- నెగెటివ్ రోల్‌లో వెంకట్!

రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ డ్రామా సినిమా రామ్ భజరంగ్. తాజాగా రామ్ భజరంగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Published on: Jan 18, 2026, 11:47:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు స్వాతి సుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

జులపాల జుట్టుతో రాజ్ తరుణ్- వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రామ్ భజరంగ్ గ్లింప్స్ రిలీజ్- నెగెటివ్ రోల్‌లో వెంకట్!
జులపాల జుట్టుతో రాజ్ తరుణ్- వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రామ్ భజరంగ్ గ్లింప్స్ రిలీజ్- నెగెటివ్ రోల్‌లో వెంకట్!

నలుగురు హీరోయిన్లు

స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మానస రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

1980 బ్యాక్ డ్రాప్‌లో

ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ రామ్ భజరంగ్ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2026లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

రామ్ భజరంగ్ మూవీ గ్లింప్స్

తాజాగా రామ్ భజరంగ్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రామ్ భజరంగ్ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ కామెంట్స్

ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ మాట్లాడుతూ.. "రామ్ భజరంగ్ సినిమా చాలా బాగుంటుంది. షూటింగ్ చేసే సమయంలోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. త్వరలో ఈ మూవీ థియేటర్స్‌లో రానుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని తెలిపారు.

డిఫరెంట్ రోల్‌లో

నటుడు వెంకట్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్‌లో నటించాను. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర మీ అందరికి నచ్చుతుంది. డైరెక్టర్ సుధీర్ రాజ్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు" అని అన్నారు.

వైడ్ అండ్ వైలెంట్ రోల్

"చాలా వైడ్ అండ్ వైలెంట్ రోల్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. ఈ మూవీలో నా లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిర్మాతలు స్వాతి సుధీర్ అలాగే రవి బాల గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను" అని వెంకట్ పేర్కొన్నారు.

రా అండ్ రస్టిక్‌గా

కాగా రామ్ భజరంగ్ గ్లింప్స్ అదిరిపోయింది. జులపాల జుట్టుతో రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్‌తో అట్రాక్ట్ చేశాడు. గ్లింప్స్‌లో తల లేకుండా మొండెంలు చూపిస్తూ రా అండ్ రస్టిక్‌గా సినిమాను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఇద్దరి స్నేహితుల మధ్య వైరం ఎలా ఏర్పడిందనే కాన్సెప్ట్‌తో ఫుల్ వయెలెంట్ యాక్షన్ లవ్ స్టోరీ సినిమాగా తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More