Drishyam 3 Release Date: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఇదే.. మోహన్‌లాల్ ట్వీట్ వైరల్.. గతమెప్పుడూ మౌనంగా ఉండదంటూ..

Drishyam 3 Release Date: దృశ్యం 3 రిలీజ్ డేట్ వెల్లడించాడు మోహన్‌లాల్. జీతూ జోసెఫ్ థ్రిల్లర్ సిరీస్ లో మూడో పార్ట్ అయిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని మే 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Published on: Mar 23, 2026, 20:52:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు, అలాగే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం 3 సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మోహన్‌లాల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ పాపులర్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Drishyam 3 Release Date: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఇదే.. మోహన్‌లాల్ ట్వీట్ వైరల్.. గతమెప్పుడూ మూగబోదంటూ..
Drishyam 3 Release Date: దృశ్యం 3 రిలీజ్ డేట్ ఇదే.. మోహన్‌లాల్ ట్వీట్ వైరల్.. గతమెప్పుడూ మూగబోదంటూ..

మోహన్‌లాల్ పోస్ట్ ఏంటంటే..

మోహన్‌లాల్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ క్రేజీ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఒక పవర్‌ఫుల్ డైలాగ్ రాసుకొచ్చాడు. గతం ఎప్పుడూ సైలెంట్‌గా ఉండిపోదు, అది కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటుంది. జార్జ్‌కుట్టి మళ్లీ వస్తున్నాడు.. మే 21, 2026న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అని పోస్ట్ చేశాడు. అదే రోజు మోహన్‌లాల్ బర్త్ డే కావడం విశేషం.

ఈ సినిమా పనులు ఎంతవరకు వచ్చాయా అని ఇన్నాళ్లూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు, ఇప్పుడు ఈ పోస్ట్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నిజానికి ఏప్రిల్ 2నే వస్తుందని భావించినా.. మేకర్స్ నుంచి ఎలాంటి ప్రమోషన్లు లేకపోవడంతో వాయిదా ఖాయమని ముందుగానే ఊహించారు.

దృశ్యం సిరీస్ రికార్డులు..

మలయాళ సినిమా చరిత్రలోనే దృశ్యం సిరీస్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ దృశ్యం సినిమాలో జార్జ్‌కుట్టి అనే ఒక సామాన్యుడు, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని దర్శకుడు జీతు జోసెఫ్ చాలా అద్భుతంగా చూపించాడు.

వాళ్లను పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంటే, అతడు వాళ్ల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడు అనేది జనాలకు భలే కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన దృశ్యం 2 కూడా అదే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఎవరూ ఊహించని ట్విస్టులు, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే గ్రిప్పింగ్ స్టోరీతో ఆ సెకండ్ పార్ట్ ఆడియన్స్‌కు చాలా బాగా నచ్చేసింది.

అజయ్ దేవగన్ హిందీ వెర్షన్..

ఈ దృశ్యం సిరీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసి, దీన్ని తెలుగు, హిందీతో పాటు చాలా భాషల్లో రీమేక్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన హిందీ వెర్షన్స్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అక్కడ కూడా దృశ్యం 2 సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు హిందీలో కూడా మూడో పార్ట్ కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

అక్కడ కూడా దృశ్యం 3 పనులు త్వరలోనే ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు కానీ, ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ బయటకు రాలేదు. ఒకవేళ మలయాళం, హిందీ వెర్షన్స్ రెండూ ఒకే టైమ్‌లో దగ్గరదగ్గరగా రిలీజ్ అయితే గనక.. దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకుల్లో ఈ ఫ్రాంచైజీ క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవు.

ఫైనల్‌గా మోహన్‌లాల్ మే 21వ తేదీన రిలీజ్ పక్కా అని కన్ఫర్మ్ చేయడంతో, పదేళ్లకు పైగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జార్జ్‌కుట్టి స్టోరీ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద భారీ ఎత్తున సందడి చేయబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More