Kajol Nysa: కూతురు నైసాతో మూడేళ్లపాటు గొడవలు, కారణం అదే- పేరెంటింగ్‌లో నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే: హీరోయిన్ కాజోల్

Kajol About Daughter Nysa Devgan Parenting: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన జెన్-జీ (Gen Z) కుమార్తె నైసా దేవగన్‌తో ఉన్న సంబంధంపై షాకింగ్ విషయాలను పంచుకున్నారు. టీనేజ్ వయసులో తమ మధ్య దాదాపు మూడేళ్లపాటు తీవ్రమైన విభేదాలు నడిచాయని కాజోల్ బహిరంగంగా అంగీకరించారు. కాజోల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 24, 2026, 16:56:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kajol About Daughter Nysa Devgan Parenting: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ దంపతులకు నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల లిల్లీ సింగ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్, తన కుమార్తె నైసా దేవగన్‌తో ఉన్న బంధం గురించి ఆసక్తికర చర్చ చేశారు.

కూతురు నైసాతో మూడేళ్లపాటు గొడవలు, కారణం అదే- పేరెంటింగ్‌లో నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే: హీరోయిన్ కాజోల్
కూతురు నైసాతో మూడేళ్లపాటు గొడవలు, కారణం అదే- పేరెంటింగ్‌లో నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే: హీరోయిన్ కాజోల్

చాలా అసహనంగా ఉండేవాళ్లం

నైసాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని హీరోయిన్ కాజోల్ తెలిపారు. "ఆ సమయంలో మేము ఇద్దరం చాలా అసహనంగా ఉండేవాళ్లం. లాజిక్ లేకుండా వాదించుకునేవాళ్లం. దాదాపు మూడేళ్లపాటు మా మధ్య మాటల్లేవు, కేవలం పోట్లాటలే ఉండేవి" అని కాజోల్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

తల్లిగా నేను నేర్చుకున్న పాఠం అదే!

పిల్లలతో గొడవ పడటం వల్ల సమస్య పరిష్కారం కాదని కాజోల్ త్వరగానే గ్రహించారు. ఒక పెద్ద వ్యక్తిగా తానే ఒక అడుగు వెనక్కి వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. "నేను మాట్లాడటం కంటే, ఆమె చెప్పేది వినడం మొదలుపెట్టాను. పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి 'స్పేస్'. ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చి, నేను ఓపికగా వినడం వల్ల మా మధ్య ఉన్న దూరం తగ్గింది. అప్పటి వరకు ఒకరిపై ఒకరు అరుచుకున్న మేము, నెమ్మదిగా సుదీర్ఘమైన సంభాషణలు మొదలుపెట్టాము. పేరెంటింగ్‌లో నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే" అని కాజోల్ వివరించారు.

ఇప్పుడు బంధం మరింత స్ట్రాంగ్

ప్రస్తుతం నైసా దేవగన్‌కు 23 ఏళ్లు. ఇప్పుడు తల్లీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలంగా ఉంది. నైసా పుట్టినరోజు సందర్భంగా కాజోల్ సోషల్ మీడియాలో ఎంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నువ్వు పుట్టాక నా ప్రపంచం మారిపోయింది. నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు దేవుడికి రోజూ కృతజ్ఞతలు చెబుతాను" అంటూ తన ప్రేమను చాటుకున్నారు కాజోల్. అయితే, నైసాకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని కాజోల్ గతంలోనే స్పష్టం చేశారు.

కెరీర్‌లో దూసుకుపోతున్న కాజోల్

ఇక కాజోల్ సినిమాల విషయానికొస్తే, 2025లో 'మా' (Maa), 'సర్జమీన్' చిత్రాలతో అలరించారు. యాదృచ్ఛికంగా ఈ రెండు సినిమాల్లోనూ ఆమె తన బిడ్డను రక్షించుకునే తల్లి పాత్రలోనే నటించడం విశేషం. ప్రస్తుతం కాజోల్.. ప్రభుదేవా, నసీరుద్దీన్ షాతో కలిసి 'మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్' అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఓటీటీ వేదికగా కూడా 'ద ట్రయల్' సీజన్-2తో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కాజోల్ కుమార్తె నైసా దేవగన్ వయసు ఎంత?

నైసా దేవగన్ ప్రస్తుతం 23వ ఏట అడుగుపెట్టారు. ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.

2. నైసా దేవగన్ సినిమాల్లోకి వస్తున్నారా?

లేదండి. తన కుమార్తెకు నటనపై ఆసక్తి లేదని, ఆమె తన కెరీర్‌ను వేరే రంగంలో ఎంచుకోవాలని భావిస్తున్నట్లు కాజోల్ పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు.

3. కాజోల్ తదుపరి సినిమా ఏమిటి?

కాజోల్ త్వరలో 'మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్' (Maharagni) అనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలో కనిపించబోతున్నారు. ఇందులో ప్రభుదేవా కీలక పాత్ర పోషిస్తున్నారు.

4. కాజోల్ - నైసా మధ్య గొడవలకు కారణం ఏంటి?

టీనేజ్ వయసులో వచ్చే మార్పులు, జెన్-జీ ఆలోచనా విధానం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అయితే చర్చల ద్వారా దానిని పరిష్కరించుకున్నామని కాజోల్ తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More