Whiskey: స్టార్ హీరో అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్‌కు 4 నెలల్లోనే 4 కోట్లు- మరో 23 రాష్ట్రాలకు- కొత్తగా స్మోకీ వేరియంట్!

Ajay Devgn Whiskey Brand Get 4 Cr Turnover: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్ ‘ది గ్లెన్ జర్నీస్’ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రూ. 4.14 కోట్ల ఆదాయాన్ని సాధించి ఆశ్చర్యపరిచింది. త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్ అడుగుపెట్టనుంది.

Published on: Feb 26, 2026, 22:00:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వెండితెరపైనే కాదు, వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. అజయ్ దేవగన్ సొంత ప్రీమియం విస్కీ బ్రాండ్ ‘ది గ్లెన్ జర్నీస్’ (The GlenJourneys) అతి తక్కువ కాలంలోనే ఊహించని మైలు రాయిని అందుకుంది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ప్రవేశించిన అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రూ. 4.14 కోట్ల టర్నోవర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్టార్ హీరో అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్‌కు 4 నెలల్లోనే 4 కోట్లు- మరో 23 రాష్ట్రాలకు- కొత్తగా స్మోకీ వేరియంట్!
స్టార్ హీరో అజయ్ దేవగన్ విస్కీ బ్రాండ్‌కు 4 నెలల్లోనే 4 కోట్లు- మరో 23 రాష్ట్రాలకు- కొత్తగా స్మోకీ వేరియంట్!

రికార్డు స్థాయిలో విక్రయాలు

అజయ్ దేవగన్, కార్టెల్ బ్రదర్స్ భాగస్వామ్యంలో రూపొందిన ఈ సింగిల్ మాల్ట్ విస్కీ బ్రాండ్ ఇప్పటివరకు 8,622 బాటిళ్లకు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో సుమారు 437 రిటైల్ అవుట్‌లెట్లలో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంది.

మహారాష్ట్రలో ప్రయాణం

మహారాష్ట్రలో ప్రారంభమైన ‘ది గ్లెన్ జర్నీస్’ విస్కీ ప్రయాణం.. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది. అంతేకాకుండా ముంబై, జైపూర్, అహ్మదాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లోని డ్యూటీ-ఫ్రీ సెక్షన్లలో కూడా ఇది లభిస్తోంది.

మెట్రో నగరాలకే కాకుండా

"సాంప్రదాయ స్కాచ్ పద్ధతులకు అనుగుణంగా గ్లెన్ జర్నీస్‌ను తీర్చిదిద్దాం. భారతీయ వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలకు (మందు బాబులకు) కూడా దగ్గరవ్వాలన్నదే మా లక్ష్యం" అని అజయ్ దేవగన్ తన బ్రాండ్ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.

విదేశీ గడ్డపై కన్నేసిన ‘గ్లెన్ జర్నీస్’

భారత్‌లో మరో 23 రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అజయ్ దేవగన్ ‘ది గ్లెన్ జర్నీస్’ విస్కీ బ్రాండ్ సంస్థ ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దుబాయ్ నుంచి 1,050 బాటిళ్ల కోసం ఆర్డర్లు వచ్చాయి. త్వరలోనే అమెరికా, కెనడా మార్కెట్లలో కూడా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, జూన్ 2026లో కొత్తగా ‘స్మోకీ వేరియంట్’ను కూడా లాంచ్ చేయనున్నారు.

సినిమా విశేషాలు

ఇక అజయ్ దేవగన్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవల ఆయన నటించిన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో ఈ చిత్రం సుమారు రూ. 100 కోట్ల కలెక్షన్స్‌తో సరిపెట్టుకుంది.

అజయ్ దేవగన్ సినిమాలు

అయితే, అజయ్ దేవగన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దృశ్యం 3’ ఈ ఏడాది అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు ‘ధమాల్ 4’, ‘గోల్‍‌మాల్ 5’ వంటి అజయ్ దేవగన్ క్రేజీ ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది కాలంలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More