అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ- బ్రాండ్ ఫిల్మ్స్ ఆవిష్కరణ- హైదరాబాద్ టు అమెరికాలో న్యూ ప్రాజెక్ట్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం అయ్యారు. అన్విత గ్రూప్‌కి బాలయ్య బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సందర్భంగా హైదరాబాద్‌లో బ్రాండ్ ఫిల్మ్స్‌ను ఆ సంస్థ సీఎండీ అచ్యుతరావు బొప్పన ఆవిష్కరించారు. ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అచ్యుతరావు బొప్పన.

Published on: Jan 10, 2026, 10:00:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం (జనవరి 9) హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు.

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ- బ్రాండ్ ఫిల్మ్స్ ఆవిష్కరణ- హైదరాబాద్ టు అమెరికాలో న్యూ ప్రాజెక్ట్స్
అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ- బ్రాండ్ ఫిల్మ్స్ ఆవిష్కరణ- హైదరాబాద్ టు అమెరికాలో న్యూ ప్రాజెక్ట్స్

బాలకృష్ణ సేవలు ఆదర్శం

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అచ్యుతరావు బొప్పన, ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ గారు చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు. మాట తప్పను–మడమ తిప్పను అనే విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాలకృష్ణ వ్యక్తిత్వం, అన్విత గ్రూప్ మౌలిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందన్నారు. అందుకే ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా కావాలని భావించడం, ఆయన ఒప్పుకోవటం సంస్థకు గర్వకారణమని తెలిపారు.

అన్విత గ్రూప్‌ది అదే నినాదం

‘బిల్డ్ హ్యాపినెస్’ అనేదే అన్విత గ్రూప్ నినాదమని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారని అచ్యుతరావు బొప్పన పేర్కొన్నారు. సంతోషంతో నిండిన శాశ్వత వారసత్వాన్ని నిర్మించే ప్రయాణంలో బాలయ్య భాగస్వామ్యం సంస్థకు మరింత బలాన్నిస్తుందన్నారు.

4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం

గత రెండు దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలో నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన అన్విత గ్రూప్, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోందని అచ్యుతరావు బొప్పన తెలిపారు. హైదరాబాద్‌లో మూడు ప్రధాన ప్రాజెక్టులతో మొత్తం 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కొనసాగుతోందన్నారు.

వినియోగదారులకు 400 యూనిట్లు

కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్‌కు షెడ్యూల్‌కు ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం విశేషమని, తొలి దశలో 400 యూనిట్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అన్విత హై నైన్, మేడ్చల్‌‌లోని అన్విత పార్క్‌ సైడ్ ప్రాజెక్టులు నగర జీవనానికి కొత్త నిర్వచనం ఇవ్వనున్నాయని అచ్యుతరావు బొప్పన చెప్పారు.

ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు

భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖలలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నగరంలోనే ఎత్తైన భవనాలను నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్, విశాఖ, అమెరికా, దుబాయ్‌లలో నూతన ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు.

ఐదారు ఏళ్లలో

రాబోయే 5–6 సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు వెయ్యి యూనిట్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అన్విత గ్రూప్ ముందుకు సాగుతోందని అన్విత గ్రూప్ చైర్మన్ అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్విత గ్రూప్ డైరెక్టర్లు నాగభూషణం బొప్పన, శ్రీకాంత్ బొప్పన, విజయరాజు, హ్యాపీ హోమ్స్ డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More