Tanisha Mukerji: డైరెక్టర్ చెప్పడంతో ఆ పని చేశా.. చివరికి అనారోగ్యానికి గురయ్యా.. హీరోయిన్ తనీషా ముఖర్జీ కామెంట్స్
Tanishaa Mukerji About Aditya Chopra: బాలీవుడ్ హీరోయిన్ తనీషా ముఖర్జీ ఓ డైరెక్టర్ చెప్పడంతో చేసిన పని తన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'నీల్ ఎన్ నిక్కీ' సినిమా కోసం తాను పడ్డ కష్టాలను, హార్మోన్ల అసమతుల్యత బారిన పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Tanishaa Mukerji About Aditya Chopra: గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవాలంటే నటీనటులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఫిజిక్ విషయంలో నిర్మాతలు, దర్శకులు పెట్టే కండిషన్లు ఒక్కోసారి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ హీరోయిన్ తనీషా ముఖర్జీ బయటపెట్టారు.

ఆదిత్య చోప్రా సూటి ప్రశ్న
2005లో వచ్చిన 'నీల్ ఎన్ నిక్కీ' సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తనీషా ముఖర్జీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. హిందీ సినీ దిగ్గజం ఆదిత్య చోప్రా తనను స్క్రీన్ టెస్ట్‌కు పిలిచినప్పుడు జరిగిన విషయాన్ని తనీషా ముఖర్జీ గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో కెరీర్ పరంగా ఆదిత్య చోప్రా ఇచ్చిన సలహాలను తాను పాటించలేదని, కానీ ఈ ప్రాజెక్ట్ సమయంలో ఆయన మాటలను గుడ్డిగా నమ్ముతానని మాటిచ్చానని తనీషా ముఖర్జీ చెప్పారు. మొదటి ఫోటో షూట్ తర్వాత ఆదిత్య చోప్రా ఆమె శరీర ఆకృతిపై అసహనం వ్యక్తం చేశారు. నడుము దగ్గర ఉన్న కొవ్వును (లవ్ హ్యాండిల్స్) చూపిస్తూ.. నిక్కీ పాత్రలో కనిపించాలంటే శరీరం పర్ఫెక్ట్ టోనింగ్‌లో ఉండాలని ఆయన కండిషన్ పెట్టారు.
పట్టుదలతో పీక్‌కు.. కానీ ఆరోగ్యం బలి
దర్శకుడి మాటలను సవాల్‌గా తీసుకున్న తనీషా ముఖర్జీ కఠినమైన డైట్, వర్కవుట్లను మొదలుపెట్టారు. తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో నిద్రాహారాలు మాని శ్రమించారు. చివరికి ఆదిత్య చోప్రా కోరుకున్న 'నిక్కీ' లుక్‌ను సాధించారు. అయితే, ఈ అతి వేగవంతమైన మార్పు ఆమె శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
నిరంతర శ్రమ, ఆహార నియంత్రణ వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నదని (Hormonal Imbalance), అది తన ఆరోగ్యానికి తీరని నష్టం కలిగించిందని తనీషా ముఖర్జీ వెల్లడించారు. ఏదైనా ఒక కఠినమైన నియమావళిని శరీరంపై సుదీర్ఘకాలం రుద్దడం ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. అంటే, డైరెక్టర్ చెప్పినట్లుగా చేయడంతో తనీషా ముఖర్జీ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
సినీ ప్రస్థానం-విమర్శలు
కాగా, ప్రముఖ నటి తనూజ కుమార్తెగా, హీరోయిన్ కాజోల్ సోదరిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తనీషా ముఖర్జీ 2003లో 'ష్..' (Sssshhh) సినిమాతో అరంగేట్రం చేశారు. 'సర్కార్', 'నీల్ ఎన్ నిక్కీ' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, తనీషా ముఖర్జీకి పెద్దగా సక్సెస్ దక్కలేదు.
అయితే తమిళ చిత్రం 'ఉన్నాలే ఉన్నాలే' తనీషా ముఖర్జీకి మంచి గుర్తింపు తెచ్చింది. సినిమాల కంటే 'బిగ్ బాస్ 7' రియాలిటీ షో ఆమెకు భారీ పాపులారిటీ ఇచ్చింది. ఆ షోలో అర్మాన్ కోహ్లీతో ఆమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్. అంతే కాకుండా బిగ్ బాస్ హిందీ 7కి రన్నరప్‌గా కూడా తనీషా నిలిచింది.
చివరిగా కనిపించింది
ఇక 2024లో లవ్ యూ శంకర్ సినిమాలో చివరిసారిగా కనిపించారు బ్యూటిపుల్ హీరోయిన్ తనీషా ముఖర్జీ. ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని సానుకూలంగా తీసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని తనీషా ముఖర్జీ ధీమా వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


