Nagarjuna Fitness: ఐదారు రోజులు వర్కవుట్, 14 గంటల ఉపవాసం- 60 ఏళ్ల నాగార్జున చెప్పిన ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్!
Nagarjuna Fitness Secrets At Age 60: వయసు పెరుగుతున్నా తరగని ఆకర్షణ, నేటి యువ హీరోలకు సైతం పోటీనిచ్చే ఫిజిక్.. అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన ఆరోగ్య రహస్యమన్న నాగార్జున ఎన్నో ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెప్పారు.
Nagarjuna Fitness Secrets At Age 60: టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున గురించి పరిచయం అక్కర్లేదు. 60 ఏళ్లు దాటినా ఆయనను చూస్తుంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. సాధారణంగా రిటైర్‌మెంట్ గురించి ఆలోచించే వయసులో, నాగార్జున మాత్రం కొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ ప్రయాణం, డైట్ ప్లాన్ గురించి నాగార్జున పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాలుగా పాటిస్తున్న నియమాలే తనను ఇంత ఫిట్‌గా ఉంచాయని నాగ్ పేర్కొన్నారు.
వ్యాయామమే నా మొదటి ప్రాధాన్యత
నాగార్జున దినచర్యలో వర్కవుట్ ఎంతటి ప్రాముఖ్యత ఉందో నాగార్జున మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. "ఉదయం నిద్రలేవగానే నా ఫస్ట్ ప్రయారిటీ ఎక్సర్‌సైజ్ మాత్రమే. అసలు వ్యాయామం చేయని రోజంటూ ఉండదు. వర్కవుట్ చేయలేకపోతే ఆ రోజు షూటింగ్‌కు కూడా వెళ్లకూడదని నిర్ణయించుకుంటాను" అని నాగార్జున చెప్పారు. వారంలో కనీసం ఐదు నుంచి ఆరు రోజులు కచ్చితంగా జిమ్‌లో గడుపుతానని నాగ్ వెల్లడించారు.
ముఖ్యంగా ఆయన చేసే వర్కవుట్ సాధారణంగా ఉండదు. గంట పాటు సాగే ఈ సెషన్‌లో కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ ఉంటాయి. గత 30-35 ఏళ్లుగా ఒకే పద్ధతిని కొనసాగిస్తుండటమే తన శరీర ఆకృతి మారకపోవడానికి ప్రధాన కారణమని నాగార్జున విశ్లేషించారు.
డైట్‌లో పెను మార్పులు.. ఆ రెండు మానేయాల్సిందే!
వయసు పెరుగుతున్న కొద్దీ శరీర తత్వానికి అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవాలని నాగార్జున సూచించారు. 30 ఏళ్లలో ఉన్నప్పుడు తిన్న ఆహారం 60 ఏళ్లలో తింటే శరీరం సహకరించదని నాగార్జున అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను ఫాలో అవుతున్న డైట్ వల్ల శరీరం చాలా తేలికగా అనిపిస్తోందని నాగ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా భారతీయుల్లో వయసు పెరిగే కొద్దీ పాల ఉత్పత్తులు (డైరీ), గ్లూటెన్ (గోధుమ సంబంధిత పదార్థాలు) పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని దూరం పెడితే సగం ఆరోగ్య సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయని నాగ్ కీలక సూచన చేశారు. రాత్రి భోజనాన్ని 7:30 గంటల కల్లా పూర్తి చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి జీవనశైలి గాడిలో పడుతుందని ఆయన వివరించారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్..
శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమని నాగార్జున నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం (Intermittent Fasting) పాటిస్తారు. సాయంత్రం భోజనం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తీసుకోరు. దీనివల్ల జీర్ణవ్యవస్థకు తగినంత రికవరీ సమయం దొరుకుతుంది.
నాగార్జున్ వీకెండ్ చిట్కాలు
అయితే, ఆయన పూర్తిగా కఠిన నియమాల్లోనే బందీగా ఉండరు. ఆదివారం వచ్చిందంటే చాలు తన మనసు కోరుకున్నది తింటారు. "నాకు చాక్లెట్లు, స్వీట్లు అంటే ఇష్టం. రోజూ కష్టపడి వ్యాయామం చేస్తున్నాను కాబట్టి, నాకు నచ్చినవి తినడంలో తప్పు లేదు. అందుకే ఆదివారం రోజున డైట్ గురించి అస్సలు ఆలోచించను" అని సరదాగా చెప్పుకొచ్చారు నాగార్జున.
మనసుకు నచ్చినవి అప్పుడప్పుడు తింటేనే డైట్ మీద విరక్తి కలగదని నాగార్జున సీక్రెట్ రివీల్ చేశారు. ఇలా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ చెప్పారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


