Sai Pallavi Ek Din: కొన్నిసార్లు లైట్లు ఆపేస్తే బాగుండనిపిస్తుంది, బాలీవుడ్ ఎంట్రీపై ఆందోళన.. సాయి పల్లవి కామెంట్స్
Sai Pallavi Comments In Ek Din Promotional Event: దక్షిణాదిలో తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇప్పుడు హిందీ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రంపై సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Sai Pallavi About In Ek Din In Promotional Event: మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి గత పదేళ్లుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఫిదా, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది సాయి పల్లవి.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిపుల్ సాయి పల్లవి. అయితే, ఇప్పుడు 'ఏక్ దిన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి సాయి పల్లవి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.
వేదికపై ఉద్వేగానికి లోనైన నటి
ఆదివారం (ఏప్రిల్ 26) జరిగిన ఏక్ దిన్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో సాయి పల్లవి పాల్గొని తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సమక్షంలో సాయి పల్లవి ప్రసంగిస్తూ కాస్త ఉద్వేగానికి, మరికొంత ఆందోళన (నెర్వస్)కు లోనైంది.
"నేను ఇంతవరకు ఏం పని చేశానో, ఎంత గొప్పగా నటించానో నాకు తెలియదు కానీ.. ఈరోజు ఇంతమంది ప్రతిభావంతుల మధ్య కూర్చునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమీర్ ఖాన్ గారు బహిరంగంగానే తన భావోద్వేగాలను పంచుకునేంత గొప్ప మనిషి. కొన్నిసార్లు లైట్లు ఆపేస్తే బాగుండనిపిస్తుంది, అప్పుడు నేను కూడా నా ఎమోషన్స్‌ను మరింత స్వేచ్ఛగా బయటపెట్టగలను" అని సాయి పల్లవి పేర్కొంది.
జునైద్ ఖాన్‌పై ప్రశంసలు
ఈ చిత్రంలో హీరోగా నటించిన జునైద్ ఖాన్ గురించి చెబుతూ సాయి పల్లవి సరదా వ్యాఖ్యలు చేశారు. జునైద్ ఒక చక్కని కో-స్టార్ అని, షూటింగ్ సమయంలో అతను చాలా క్రమశిక్షణతో, ఒక విధేయుడైన విద్యార్థిలా ఉండేవారని ఆమె కొనియాడింది.
బాలీవుడ్‌లో తన మొదటి అడుగు కాబట్టి ప్రస్తుతం చాలా నెర్వస్‌గా ఉందని, అయితే ఈ ప్రయాణం మాత్రం ఎంతో అందంగా సాగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈ క్రెడిట్ అంతా టీమ్ మొత్తానికి ఇస్తూ, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో భాగం కావడంపై కృతజ్ఞతలు తెలిపింది.
'ఏక్ దిన్' - ఒక అందమైన ప్రేమకథ
సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2016 నాటి థాయ్ సినిమా 'వన్ డే'కి రీమేక్‌గా వస్తోంది. ఆఫీసులో పనిచేసే తన సహోద్యోగిని ప్రేమించి, ఆమెకు ఆ విషయం చెప్పలేక సతమతమయ్యే ఒక యువకుడి కథ ఇది.
కనీసం ఒక్క రోజైనా ఆమెతో కలిసి ఉండాలని అతను కోరుకోవడం, అది నిజం కావడం చుట్టూ ఈ రొమాంటిక్ డ్రామా తిరుగుతుంది. అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సాయి పల్లవి నటించిన మొదటి హిందీ సినిమా ఏది?
సాయి పల్లవి 'ఏక్ దిన్' సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. ఇందులో ఆమె అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించారు.
2. 'ఏక్ దిన్' సినిమా కథ దేని ఆధారంగా రూపొందింది?
ఇది 2016లో విడుదలైన 'వన్ డే' అనే థాయ్ చిత్రానికి అధికారిక రీమేక్. ఒక యువకుడు తన ప్రియురాలితో ఒక్కరోజు గడపాలనే కోరిక చుట్టూ ఈ కథ సాగుతుంది.
3. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


