Sai Pallavi: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. ఏక్ దిన్ రిలీజ్ ఎప్పుడంటే?
Sai Pallavi: సాయి పల్లవి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఏక్ దిన్ ట్రైలర్ (Ek Din Trailer) రిలీజైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న విభిన్నమైన లవ్ స్టోరీ మూవీ 'ఏక్ దిన్' (Ek Din). ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ బుధవారం (మార్చి 11) విడుదలైంది. ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.

ఏక్ దిన్ ట్రైలర్.. రోహన్, మీరా లవ్ స్టోరీ
ఏక్ దిన్ మూవీ ట్రైలర్ ప్రారంభంలో మంచి లవ్ పార్ట్‌నర్ దొరకాలని కోరుకుంటూ కొందరు చేసే 'ఫార్చ్యూన్ బెల్' (Fortune Bell) సంప్రదాయాన్ని చూపించారు. జునైద్ ఖాన్ పోషించిన రోహన్ పాత్ర.. తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)తో కేవలం "ఒక్క రోజు" గడపాలని ఎంతగానో పరితపిస్తుంటాడు. సరదాగా సాగిపోయే సన్నివేశాలతో మొదలైన ట్రైలర్, ఒక్కసారిగా భావోద్వేగభరితమైన మలుపు తిరుగుతుంది.
ఈ కథలో ప్రధానాంశం 'క్షణికమైన బంధం'. ట్రైలర్ చివరలో మీరా, రోహన్‌ను "ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో" అని గట్టిగా అరుస్తుంది. కానీ "కొన్నిసార్లు ఒక్క రోజు చాలు" అనే డైలాగ్ కథలోని లోతును వివరిస్తుంది. రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు అనే గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ముగియడం ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతోంది.
ఏక్ దిన్ నటీనటులు, ఇతర విశేషాలు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవికి ఇది మొదటి హిందీ సినిమా కావడం విశేషం. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా స్క్రీన్ ప్లే అందించారు. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్‌లు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ చేతులు కలిపారు.
రామ్ సంపత్ మ్యూజిక్ కంపోచ్ చేయగా.. అరిజిత్ సింగ్ పాడిన టైటిల్ సాంగ్ ఇప్పటికే హైలైట్‌గా నిలిచింది. 2016 నాటి థాయ్ రొమాంటిక్ డ్రామా 'వన్ డే' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జపాన్‌లోని సపోరో మంచు కొండల నేపథ్యంలో అందమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి.
మే 1న గ్రాండ్ రిలీజ్
ముందుగా 2025 చివరలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ మే 2026కు ఖరారైంది. మొదట 'మేరే రహో' అనే టైటిల్ అనుకున్నప్పటికీ.. చివరకు 'ఏక్ దిన్' అనే పేరును ఖరారు చేశారు. వేసవి కానుకగా మే 1న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాలతో పోటీ పడనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












