Haiku OTT: 90 రోజుల షూటింగ్ పూర్తి, అప్పుడే హైకూ ఓటీటీ రైట్స్ ఫిక్స్-కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీపై దర్శకనిర్మాతలు
Haiku OTT Rights Sold: ఇంకా సినిమా పూర్తి కాలేదు. అప్పుడే ఓటీటీ రైట్స్ ఫిక్స్ అయిపోయాయి. ఆ సినిమానే హైకు. కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటిస్తున్న తెలుగు, తమిళ చిత్రం హైకూ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయాయి. 4 షెడ్యూళ్లలో 90 రోజుల షూటింగ్ పూర్తి సందర్భంగా దర్శకనిర్మాతల కామెంట్స్ చూద్దాం.
Haiku OTT Rights Sold: ‘కోర్ట్’ సినిమాలో చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న హీరోయిన్ శ్రీదేవి అపల్ల లేటెస్ట్ మూవీ ‘హైకూ’. ఈ తెలుగు, తమిళ బహుభాషా చిత్రంలో శ్రీదేవితో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

4 షెడ్యూల్స్, 90 రోజుల షూటింగ్
విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు హైకూ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం హైకూ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ.. "‘హైకూ’ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం. ఇది మా ఎంటైర్ టీమ్‌కు చాలా ఎమోషనల్, హ్యాపీ మూమెంట్. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలు డా. డి. అరుళానందుగారికి, మాథేవో అరుళానందు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు" అని చెప్పారు.
ఊహించిన దానికంటే
"ఓ డైరెక్టర్ విజన్‌కు అండగా నిలిచే నిర్మాతలు దొరకడం అదృష్టం. ఆ విషయంలో నాకు నిర్మాతల నుంచి తిరుగులేని మద్దతు లభించడాన్ని మరచిపోలేను. వాళ్లు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే మేం ఊహించిన దానికంటే సినిమా బాగా వచ్చింది" అని దర్శకుడు యువరాజ్ చిన్నసామి తెలిపారు.
"శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్‌తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సహకారంతో ‘హైకూ’ సినిమాను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగమైన చిత్రంగా, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఫీల్‌నిచ్చే మూవీలాగా రూపొందిస్తున్నాం. విజన్ సినిమా హౌస్ భవిష్యత్తులో చాలా మంది యువ దర్శకులకు చక్కటి వేదికగా మారుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని యువరాజ్ చిన్నసామి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి
నిర్మాతలు డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు మాట్లాడుతూ, "‘హైకూ’ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథపై డైరెక్టర్‌కు ఉన్న స్పష్టత, మేకింగ్‌లో తను చూపిన నిజాయితీ, క్రమశిక్షణతో సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి" అని అన్నారు.
కాగా, శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన హైకూ చిత్రంలో అదిర్చి అరుణ్, మైమ్ గోపి, ‘సత్యం సుందరం’ ఫేమ్ ఇందుమతి, ‘లబ్బరు పందు’ ఫేమ్ జెన్సన్, ‘సిరాయ్’ ఫేమ్ ఇస్మత్ బాను, డాక్టర్ శివ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
హైకూ ఓటీటీ రైట్స్
హరిహరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటర్‌గా శక్తి ప్రాణేష్, మ్యూజిక్ డైరెక్టర్‌గా సిద్ధు కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా ప్రేమ్ వర్క్ చేశారు. రీసెంట్ టైమ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చాలా సెలెక్టివ్‌గా కంటెంట్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి.
ఇలాంటి క్రమంలో ‘హైకూ’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపే సినిమా పోస్ట్-థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. మేకింగ్ సమయంలోనే ఓటీటీ డీల్ కుదరడం అంటే సినిమా కథా బలం, యూనివర్సల్ ఎమోషనల్ అప్పీల్‌పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


