Anirudh Ravichander Aravindh: అరవింద్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాట- ఆల్బుకర్కీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!

Anirudh Ravichander Aravindh Song Released: స్టార్ మ్యూజిక డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఆల్బుకర్కీ రికార్డ్స్ ఇండిపెండెంట్ లేబుల్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీని నుంచి తాజాగా అరవింద్ సాంగ్‌ను విడుదల చేశారు అనిరుధ్.

Published on: Jun 15, 2026, 17:55:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anirudh Ravichander Aravindh Song Released As First Song: సంగీత సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు.

అరవింద్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాట- ఆల్బుకర్కీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!
అరవింద్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాట- ఆల్బుకర్కీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!

తెలుగు తమిళ భాషల్లో

ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుధ్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.

2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి ఢీ’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు.

రాక్‍‌స్టార్ బిరుదు వరకు

అనిరుధ్..చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధార‌ణ స్థాయికి ఎదిగి అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్నారు. ఇక అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. వేగంగా మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌టానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు అనిరుధ్.

ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్. అనిరుధ్‌కి ప్రతిబింబంలాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అర‌వింద్‌. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సుల‌భం.

ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా

అయితే ద‌క్షిణ భార‌త సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విష‌యం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో అరవింద్ ముందుకు సాగుతుంటాడు.

ఈ సంద‌ర్బంగా అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ "‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ త‌ర‌హా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న‌ ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. అలాగే నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఉన్న విప‌రీత‌మైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే స‌మ‌యంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది చూపిస్తుంది" అని అన్నారు.

అరవింద్ వంటి దశను

ఈ పాటకు అనిరుధ్‌కు వ్య‌క్తిగ‌తంగా క‌నెక్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే త‌ను కూడా జీవితంలో ఒకప్పుడు అరవింద్ వంటి ద‌శ‌ను ఎదుర్కొన్న‌వాడే. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు.

అలాగే తన ఎదుగుదల, ఎదురైన సవాళ్లు, అలాగే మొత్తం ఇండస్ట్రీ పై ధైర్యంగా, ఆత్మపరిశీలనతో కూడిన వ్యాఖ్యల‌నును కూడా ఈ పాట ద్వారా తెలియ‌జేస్తున్నారు. అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ , కాన్సెప్చువ‌ల్ ప్రాజెక్ట్స్‌ను డెవ‌ల‌ప్ చేసి రిలీజ్ చేయ‌టానికి అనిరుద్ సిద్ధ‌మ‌వుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More