Mr Work From Home: నచ్చితే పది మందికి చెప్పండి.. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్‌పై నిర్మాత అరవింద్ కామెంట్స్.. ఉపయోగపడేదంటూ!
Mr Work From Home Press Meet Producer Aravind Madhudeep: హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత అరవింద్, డైరెక్టర్ మధుదీప్ కామెంట్స్ చేశారు.
Mr Work From Home Press Meet Aravind Madhudeep: హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా ఫేమ్ త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్.వి.ఎస్.ఎన్ బాబ్జీ సమర్పించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మంచి టీమ్ వర్క్‌తో చేశారు
ప్రెస్ మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా చాలా క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అందరూ మంచి టీమ్ వర్క్‌తో చేశారు. ఇందులో విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్" అని అన్నారు.
మీ ప్రోత్సాహం కావాలి
"ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాను. రామ్ దాస్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని ప్రొడ్యూసర్ అరవింద్ తెలిపారు.
ఈరోజు అది అర్థమైంది
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. దాసరి గారు “ప్రేక్షక దేవుళ్లు” అనేవారు. ఆయన ఎందుకు అలా అనేవారో ఈ రోజు అర్థమైంది. ప్రేక్షకులు కనికరిస్తేనే సినిమా ప్రాణం పోసుకుంటుంది" అని అన్నారు.
అందరికి కనెక్ట్ అవుతుంది
"ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథలోని కాన్‌ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రామ్ దాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడం మా నమ్మకాన్ని మరింత బలపరిచింది" అని డైరెక్టర్ మధుదీప్ పేర్కొన్నారు.
క్లైమాక్స్ కూడా ఉపయోగపడుతుంది
"ఈ సినిమా సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ కూడా నిజ జీవితానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బలంగా ఉంటుంది" అని చాలా నమ్మకంగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి చెప్పారు దర్శకుడు మధుదీప్.
తెలుగు నేర్చుకుని
"పాయల్ రాధాకృష్ణ, హీరో త్రిగుణ్ అద్భుతంగా నటించారు. పాయల్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారు. త్రిగుణ్ నా ఫస్ట్ హీరో. తనని ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది" అని డైరెక్టర్ మధుదీప్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


