నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది- భార్య గౌరీ ఖాన్ గురించి సింగర్‌కు షారుఖ్ ఖాన్ వార్నింగ్- రూ. 75 నుంచి 99 ఆస్తుల దాకా!

Shah Rukh Khan Warns Singer Mika Singh On Gauri Khan: ఒకప్పుడు కేవలం 75 రూపాయల పారితోషికంతో కెరీర్ ప్రారంభించిన ప్రముఖ సింగర్ మికా సింగ్.. నేడు దేశవ్యాప్తంగా 99 ఆస్తులకు అధిపతిగా మారారు. అయితే, భార్య గౌరీ ఖాన్ గురించి సింగర్ మికా సింగ్‌కు షారుఖ్ ఖాన్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఆయన పంచుకున్నారు.

Published on: Jun 15, 2026, 09:36:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shah Rukh Khan Warns Singer Mika Singh About Gauri Khan: భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మికా సింగ్ సంచలన విషయాలను పంచుకున్నారు. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 99 స్థిరాస్తులు (Properties) కలిగి ఉన్న ఈ స్టార్ సింగర్.. ముంబై నగరంలో అత్యంత ఖరీదైన అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ. 50 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు.

నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది- భార్య గౌరీ ఖాన్ గురించి సింగర్‌కు షారుఖ్ ఖాన్ వార్నింగ్- రూ. 75 నుంచి 99 ఆస్తుల దాకా!
నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది- భార్య గౌరీ ఖాన్ గురించి సింగర్‌కు షారుఖ్ ఖాన్ వార్నింగ్- రూ. 75 నుంచి 99 ఆస్తుల దాకా!

అయితే, ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని సృష్టించడం తన ఆశయం కాదని, కేవలం ఒక మంచి గాయకుడిగా స్థిరపడాలనేదే తన ఏకైక కల అని సింగర్ మికా సింగ్ పేర్కొన్నారు.

రూ. 75 జీతం నుండి మొదలైన ప్రస్థానం

చిన్నతనంలోనే సంగీతం వైపు అడుగులు వేసిన మికా సింగ్.. కేవలం 13 ఏళ్ల వయసులో జగరణ్ (భక్తి సంగీత కార్యక్రమాలు) లలో పాటలు పాడేవారు. ఆ సమయంలో ఆయన అందుకున్న మొదటి పారితోషికం అక్షరాలా 75 రూపాయలు మాత్రమే.

ఆనాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. "రూ. 75 చాలా చిన్న మొత్తమే అయినప్పటికీ, ఆ వయసులో నేను ఆ సంపాదనతో ఎంతో సంతోషపడ్డాను. ఎప్పుడూ నిరాశ చెందలేదు" అని మికా సింగ్ వివరించారు. తన అన్న, ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహందీ తనకు అండగా నిలిచారని, ఆయన మార్గదర్శకత్వంలోనే సంగీతంలోని మెళకువలు నేర్చుకుని ఆర్థికంగా ఈ స్థాయికి ఎదిగానని కృతజ్ఞత చాటుకున్నారు.

ఒకే బిల్డింగ్‌లో ఆరు ఫ్లాట్లు!

తన ముంబై ఇంటి కొనుగోలు వెనుక ఉన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను మికా సింగ్ పంచుకున్నారు. 2012లో అంధేరి ప్రాంతంలో ఒక మంచి బిల్డింగ్ కడుతున్నారని తెలిసి సాధారణంగా చూడటానికి వెళ్లిన ఆయన.. అక్కడి వాతావరణం నచ్చి ఒకేసారి ఆ బిల్డింగ్‌లో ఆరు ఫ్లాట్లను కొనుగోలు చేశారు.

2018లో ఆ ప్రాజెక్ట్ పూర్తయి చేతికి వచ్చిన తర్వాత, ఆ ఫ్లాట్లన్నింటినీ కలిపి ఒక భారీ లగ్జరీ హౌస్‌గా మార్చేశారు. మొదట ఎనిమిది బెడ్‌రూమ్‌లతో ప్లాన్ చేసిన ఈ ఇంటిని, తర్వాత ఐదు విశాలమైన బెడ్‌రూమ్‌లు, గెస్ట్ సూట్లు, దాదాపు 40 మంది అతిథులు ఒకేసారి కూర్చోగలిగేలా భారీ లివింగ్ ఏరియాతో రీ-డిజైన్ చేయించారు.

నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది..

ఈ డ్రీమ్ హౌస్‌ను సరికొత్తగా తీర్చిదిద్దడానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌ను మికా సింగ్‌ పెట్టుకోవాలనుకున్నారు. అయితే నేరుగా కాకుండా తన ఆప్తమిత్రుడు షారుఖ్ ఖాన్ ద్వారా గౌరీకి ఈ ఆఫర్ పంపించారు.

ఆ సమయంలో షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో నవ్వుతూ.. "ఆమె నీ జేబుకు పెద్ద చిల్లు పెడుతుంది (Bahut lootegi tumhe), చాలా ఖర్చు చేయిస్తుంది" అంటూ సరదాగా హెచ్చరించారు. అయినప్పటికీ మికా పట్టుబట్టడంతో, షారుఖ్‌ స్వయంగా గౌరీతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను ఓకే చేయించారు.

గౌరీ ఖాన్ పెట్టిన ఏకైక కండిషన్

ఇంటి డిజైనింగ్ బాధ్యతలు తీసుకునే ముందు గౌరీ ఖాన్ ఒక కఠినమైన నిబంధన పెట్టారు. తను చేసే డిజైన్ల విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని, అడ్డు చెప్పకూడదని స్పష్టం చేశారు. మికా సింగ్ అందుకు వెంటనే అంగీకరించారు. సాధారణంగా మికా సింగ్‌కు తన ఇళ్లలో బ్రౌన్, బేజ్ రంగులు ఉండటం ఇష్టం.

ఆకుపచ్చ (Green) రంగును ఆయన అస్సలు ఇష్టపడరు. కానీ, గౌరీ ఖాన్ దానికి భిన్నంగా ఇంటికి సరిగ్గా మధ్యభాగంలో ఒక పెద్ద గ్రీన్ సోఫాను ఏర్పాటు చేశారు. దాదాపు రెండేళ్ల పాటు జరిగిన ఈ ఇంటీరియర్ పనుల సమయంలో మికా సింగ్ ఒక్కసారి కూడా వెళ్లి ఇల్లు ఎలా తయారవుతుందో చూడలేదు.

నటుడిగా ఎంట్రీ

గౌరీ ఖాన్ సృజనాత్మకతపై ఉన్న నమ్మకంతోనే పూర్తిగా ఆమెకే వదిలేశానని, నేడు ఇల్లు చూసుకుంటే ఎంతో గర్వంగా ఉందని సింగర్ మికా సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. సంగీత రంగంలోనే కాకుండా వెండితెరపై కూడా సందడి చేయడానికి మికా సింగ్ సిద్ధమవుతున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) చిత్రం 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More