Shreya Sharma: మళ్లీ జోడీ కట్టిన శ్రేయ శర్మ, ప్రేరణ అరోరా- మలయాళంలోకి సింగర్ ఎంట్రీ- ఆ సూపర్ హిట్ సాంగ్ తర్వాత ఇలా!
Singer Shreya Sharma Malayalam Debut With Prerna Arora: 'పల్లో లట్కే' మ్యూజిక్ వీడియో సూపర్ హిట్ తర్వాత ప్రముఖ నటి, మోడల్, సింగర్ శ్రేయ శర్మ, స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా మరోసారి చేతులు కలిపారు. ఓ ప్రతిష్టాత్మక మలయాళ సినిమా భారీ ప్రమోషనల్ సాంగ్‌లో శ్రేయ శర్మ తన స్టెప్పులతో అలరించనుంది.
Singer Shreya Sharma Malayalam Debut With Prerna Arora: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో 'పల్లో లట్కే' మ్యూజిక్ ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన నటి శ్రేయ శర్మ, బాలీవుడ్ అగ్ర నిర్మాత ప్రేరణ అరోరా సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మలయాళంలోకి శ్రేయ శర్మ
ఈసారి వారు కేవలం హిందీ రంగానికే పరిమితం కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమపై కన్నేశారు. ఒక భారీ మలయాళ చిత్రంలో స్పెషల్ ప్రమోషనల్ డ్యాన్స్ నంబర్ కోసం ఈ క్రేజీ కాంబో మళ్లీ జతకట్టింది. శ్రేయ శర్మ కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలవనుంది, ఎందుకంటే ఆమె మలయాళ చిత్ర పరిశ్రమ (మాలీవుడ్) లోకి అడుగుపెడుతున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
నిర్మాత ప్రేరణ అరోరాకు, శ్రేయ శర్మకు మధ్య మంచి ప్రొఫెషనల్ బాండింగ్ ఉంది. 'పల్లో లట్కే' సమయంలో శ్రేయ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్ చూసిన ప్రేరణ.. ఈ కొత్త మలయాళ ప్రాజెక్ట్‌లోని స్పెషల్ సాంగ్‌కు ఆమె అయితేనే వంద శాతం న్యాయం చేయగలదని నమ్మారు. ఈ క్రేజీ ఆఫర్ గురించి శ్రేయ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు.
పల్లో లట్కేను మించి ఉంటుంది!
"ప్రేరణ అరోరాతో మళ్లీ కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మా 'పల్లో లట్కే' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కింది, ఆ సక్సెస్ మాకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు చేయబోయే సాంగ్ ఇప్పటివరకు నేను చేసిన వాటన్నింటికంటే పూర్తి భిన్నంగా ఉంటుంది" అని శ్రేయ శర్మ తెలిపారు.
"పల్లో లట్కేకు ఒక ప్రత్యేకమైన చార్మ్, ఎనర్జీ ఉంటే.. ఈ సరికొత్త డ్యాన్స్ నంబర్ అంతకంటే చాలా పెద్దగా, బోల్డ్‌గా, కంప్లీట్‌గా 'హట్కే' స్టైల్‌లో ఉంటుంది. ఈ మలయాళ సినిమాకు ఇది అధికారిక ప్రమోషనల్ సాంగ్ కావడమే కాకుండా, చిత్రానికే ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని శ్రేయ శర్మ ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణాది సినిమాలకు, ముఖ్యంగా మలయాళ చిత్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ రావడం విశేషం. ఈ క్రేజీ సాంగ్ కోసం మాలీవుడ్‌కు చెందిన టాప్ కొరియోగ్రాఫర్ శిక్షణ ఇస్తుండటం మరో విశేషం.
సరికొత్త ఇండస్ట్రీ.. సరికొత్త ఛాలెంజ్
"మలయాళ చిత్ర పరిశ్రమతో నాకు ఇదే మొదటి అసోసియేషన్, అందుకే ఈ ప్రాజెక్ట్ నా మనసుకు మరింత దగ్గరైంది. పల్లో లట్కే లాంటి హిట్ తర్వాత నా కెరీర్‌లో రాబోతున్న రెండో భారీ మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇది. ఇంతకంటే మంచి అవకాశం నేను కోరుకోలేను" అని శ్రేయ శర్మ పేర్కొన్నారు.
"మా కాంబినేషన్ ప్రేక్షకులకు మళ్లీ ఒక స్పైసీ, ఫ్రెష్, మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ప్రేరణ మేడమ్ మొదటి నుంచి నమ్మారు. అందుకే ఆమె ఈ సాంగ్ కోసం నన్నే ఎంపిక చేసుకున్నారు. మాలీవుడ్‌లోని టాప్ కొరియోగ్రాఫర్‌లలో ఒకరి వద్ద డ్యాన్స్ నేర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం. ప్రతి రిహార్సల్ సెషన్ నన్ను ఒక పర్ఫార్మర్‌గా కొత్తగా ఆవిష్కరిస్తోంది" అని శ్రేయ శర్మ వివరించారు.
త్వరలో అధికారికంగా
ప్రస్తుతం శ్రేయ శర్మ ఈ ఐటమ్ సాంగ్ డ్యాన్స్ నంబర్ కోసం శరవేగంగా ప్రాక్టీస్ చేస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ మలయాళ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఈ పాట ప్రోమో అధికారికంగా విడుదల కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


