OTT: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఇవే ఎందుకంటే?

Best OTT Telugu Dubbing Malayalam Thriller Movies To Watch: ఓటీటీలో ఎన్నో మలయాళ థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో సైకలాజికల్ థ్రిల్లర్స్ జోనర్స్ స్టైల్ సెపరేట్. మరి ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 4 తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 14, 2026, 07:46:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Best OTT Telugu Dubbing Malayalam Thriller Movies To Watch: మలయాళ చిత్ర పరిశ్రమ హ్యూమన్ సైకాలజీని, మైండ్ గేమ్స్‌ను తెరపై ఆవిష్కరించడంలో సిద్ధహస్తులు. కేవలం రక్తం చిందించే క్రైమ్ కథలు కాకుండా, మనుషుల ఆలోచనలు, భ్రమలు, మానసిక సంఘర్షణల చుట్టూ సాగే సైకలాజికల్ థ్రిల్లర్స్‌కు అక్కడ మంచి ఆదరణ ఉంది.

ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఇవే ఎందుకంటే?
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 4 తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్స్- 7కిపైగా రేటింగ్- ఇవే ఎందుకంటే?

డిఫరెంట్ ఓటీటీల్లో ఎన్నో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో ది బెస్ట్ 4 ఓటీటీ తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్, వాటిని ఎందుకు చూడాలనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. కిష్కింధ కాండం (Kishkindha Kaandam)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (Jio Hotstar)

ఐఎమ్‌డిబి రేటింగ్: 8.3/10

కథ: అడవికి సమీపంలో ఉండే ఒక ఇంట్లో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అప్పు పిళ్ళై తన కొడుకు అజయ్, కొత్తగా పెళ్లయిన కోడలు అపర్ణతో కలిసి ఉంటాడు. అప్పు పిళ్ళై తీవ్రమైన మతిమరుపు (Amnesia) తో బాధపడుతూ ఉంటాడు. అయితే, అతని లైసెన్స్‌డ్ పిస్టల్ ఒకటి అకస్మాత్తుగా మాయమవుతుంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఒక అస్థిపంజరం దొరుకుతుంది. ఈ రెండింటికీ ఆ కుటుంబానికి ఉన్న లింక్ ఏంటి అనే మానసిక సంఘర్షణ చుట్టూ కథ తిరుగుతుంది.

ఇంట్రెస్టింగ్ అంశాలు: ఇదొక స్లో-బర్న్ సైకలాజికల్ మిస్టరీ. ఒక మనిషి తన జీవితంలో జరిగిన అతిపెద్ద విషాదాన్ని తట్టుకోలేక మెదడును ఎలా కంట్రోల్ చేసుకుంటాడు, జ్ఞాపకాలను ఎలా దాచేస్తాడు అనే సైకలాజికల్ కోణాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ మీ గుండెను పిండేస్తుంది.

2. భూతకాలం (Bhoothakaalam)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: సోనీలివ్ (SonyLIV)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.5/10

కథ: క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ఒక స్కూల్ టీచర్ ఆశా (రేవతి), నిరుద్యోగంతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆమె కొడుకు విను (షేన్ నిగమ్) ఒక పాత అద్దె ఇంట్లో నివసిస్తుంటారు. ఇంట్లో ఉండే ముసలావిడ చనిపోయిన తర్వాత, అక్కడ కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. అయితే, అవి నిజంగా దెయ్యం వల్ల జరుగుతున్నాయా లేక ఆ తల్లి కొడుకుల మానసిక భ్రాంతి (Psychosis) వల్ల కనిపిస్తున్నాయా అనే గందరగోళం వారిని పిచ్చివాళ్లను చేస్తుంది.

ఆకట్టుకునే అంశాలు: ఇది కేవలం హారర్ సినిమా కాదు, అంతకంటే మించిన సైకలాజికల్ డ్రామా. డిప్రెషన్, ఒంటరితనం ఒక మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేస్తాయో నటి రేవతి, షేన్ నిగమ్ తమ నటనతో చూపించారు. చివరి 20 నిమిషాల సీన్స్ మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడతాయి.

3. ట్రాన్స్ (Trance)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.3/10

కథ: విజు ప్రసాద్ (ఫహాద్ ఫాజిల్) ఒక చిన్నపాటి మోటివేషనల్ స్పీకర్. మానసిక సమస్యలతో ఉన్న అతని తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోతాడు. ఆ సమయంలో ఒక కార్పొరేట్ మాఫియా అతన్ని ఒక పెద్ద "ఫెయిత్ హీలర్" (దైవ దూత) లా మార్చి, ప్రజల నమ్మకాలతో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో డ్రగ్స్, మైండ్ కండిషనింగ్ వల్ల విజు తన అసలు గుర్తింపును కోల్పోయి తీవ్ర మానసిక భ్రమల్లోకి ఎలా వెళ్లాడనేదే కథ.

ఆకట్టుకునే అంశాలు: ఫహాద్ ఫాజిల్ వన్-మ్యాన్ షో ఇది. ఒక మనిషి తీవ్రమైన మానసిక విక్షేపానికి (Dissociation) గురైనప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మేకింగ్ స్టైల్, విజువల్స్ మిమ్మల్ని ఒక సరికొత్త ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి.

4. రోషాక్ (Rorschach)

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (Jio Hotstar)

ఐఎమ్‌డిబి రేటింగ్: 7.1/10

కథ: లూక్ ఆంటోనీ (మమ్ముట్టి) అనే ఎన్ఆర్ఐ తన గర్భిణీ భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా ఒక అడవి ప్రాంతంలో యాక్సిడెంట్ అవుతుంది. అతని భార్య కనిపించకుండా పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కానీ, లూక్ ప్రవర్తన అంతా వింతగా ఉంటుంది. అసలు అతను వెతుకుతుంది అతని భార్యనేనా? లేక తన జీవితాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి వచ్చాడా? ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోతే మరి పగ ఎలా తీర్చుకుంటాడు? అనే మైండ్ గేమ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్: రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ (సైకాలజీలో మనుషుల అంతర్గత ఆలోచనలను అంచనా వేసే పరీక్ష) ఆధారంగా ఈ సినిమా పేరు పెట్టారు. పగ, హాలూసినేషన్ అనే అంశాలను చాలా డార్క్ అండ్ స్టైలిష్‌గా తెరకెక్కించారు. మమ్ముట్టి నటన నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More