OTT Bold: ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ సిరీస్‌లు.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌, బోల్డ్‌.. ఎందుకు చూడాలంటే?

OTT Bold: ఓటీటీ ఆడియన్స్ కు సరికొత్త వినోదాన్ని అందించేందుకు శుక్రవారం వచ్చేసింది. ఈ రోజు ఓటీటీలోకి రెండో మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా.. మరొకటి బోల్డ్ సిరీస్. మరి వీటిని ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకుందాం. 

Published on: Jun 12, 2026, 09:41:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Bold: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తాయి. అలా ఈ రోజు (జూన్ 12) రెండు డిఫరెంట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్ లు ఓటీటీ బాట పట్టాయి. ఇవి రెండు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి.

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ సిరీస్‌లు.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌, బోల్డ్‌.. ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ సిరీస్‌లు.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌, బోల్డ్‌.. ఎందుకు చూడాలంటే?

రాఖ్ ఓటీటీ

శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘రాఖ్’. ఈ హిందీ ఒరిజినల్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే, ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ కీలక పాత్రలు పోషించారు.

రాఖ్ స్టోరీ ఇదే

1970ల కాలంలో జరిగిన భయంకరమైన నేరాలు, వాటి వెనుక ఉన్న కథ ఆధారంగా రాఖ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాబు, రజ్జో అనే ఇద్దరు సైకో క్రిమినల్స్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతోంది. వీళ్లు చేసిన దారుణాలు ఏంటీ? వీళ్లను పట్టుకోవడానికి ఎస్ఐ జయప్రకాష్ (అలీ ఫజల్) ఏం చేశాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఎందుకు చూడాలంటే?

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రాఖ్ కూడా అలాంటి సిరీసే. ఇందులో థ్రిల్ పంచే అంశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అంతే కాకుండా చాలా కాలం తర్వాత సోనాలి బింద్రే ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. క్రిమినల్ గ్యాంగ్ ను పోలీసులు వెంటాడటం, మధ్యలో వచ్చే ఉత్కంఠ కోసం ఈ సిరీస్ చూడొచ్చు.

ష్ సీజన్ 3

ఇక ఈ రోజు ఓటీటీలో బోల్డ్ వెబ్ సిరీస్ ‘ష్’ సీజన్ 3 సందడి మామూలుగా లేదు. ఆహా తమిళ్ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వేదిక. పూర్తిగా బోల్డ్ నెస్ తో నిండిన ఈ సిరీస్ కేవలం పెద్దవాళ్లకు మాత్రమే.

బోల్డ్ సిరీస్

ష్ సిరీస్ లో ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఇప్పుడు కొత్త స్టార్స్ తో మరింత బోల్డ్ గా ష్ సీజన్ 3 వచ్చింది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ దివి, కిరణ్ రాథోడ్, పూనమ్ బజ్వా తదితరులు నటించారు.

ఇటీవల సోషల్ మీడియాలో సబ్ స్క్రిప్షన్ అనేది ట్రెండ్ గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. డబ్బుల కోసం అంగాంగ ప్రదర్శన చేస్తారా? అనే దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడీ నేపథ్యాన్నే ష్ సీజన్ 3లో చూపించినట్లు తెలిసింది. బోల్డ్ నెస్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సిరీస్ లో ఉందని అంటున్నారు.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు

రాఖ్ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?

క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

బోల్డ్ వెబ్ సిరీస్ ష్ సీజన్ 3లో ఎవరెవరు నటించారు?

ష్ సీజన్ 3లో బిగ్ బాస్ ఫేహ్ దివి, కిరణ్ రాథోర్, పూనమ్ బజ్వా తదితరులు నటించారు.

చాలా కాలం తర్వాత సోనాలి బింద్రే నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ ఏది?

సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే చాలా కాలం తర్వాత రాఖ్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More