Brown OTT: సిగరెట్ తాగుతూ, మందు కొట్టే బోల్డ్ పోలీస్-గ్లామర్ హీరోయిన్ కరిష్మా కపూర్ న్యూ లుక్-ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్
Brown OTT: బాలీవుడ్ లో ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఇప్పుడు పూర్తిగా తన లుక్ మార్చుకుంది. బోల్డ్ పోలీస్ ఆఫీసర్ గా కొత్త అవతారంలో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. బ్రౌన్ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.
Brown OTT: నైంటీస్ లో బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఊపేసిన స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ 'బ్రౌన్' (Brown) ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

బోల్డ్ పోలీస్ గా కరిష్మా
ఇన్నాళ్లూ గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన కరిష్మా కపూర్.. ఈ నియో-నాయర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్రౌన్ లో పూర్తిగా డిఫరెంట్ గా కనిపించింది. సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ బోల్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటించింది. కోల్‌కతా నగరంలోని చీకటి కోణాలు, నేరాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇందులో కరిష్మా తన గతాన్ని మర్చిపోలేక, మద్యానికి బానిసైన రీటా బ్రౌన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఒక ఘోరమైన మర్డర్ కేసును ఛేదించే క్రమంలో ఆమె ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నారనేది ఈ కథ సారాంశం.
మర్డర్ మిస్టరీ
కోల్‌కతా నగరంలోని భయానక వాతావరణం నేపథ్యంలో 'బ్రౌన్' సిరీస్ సాగుతుంది. ఒకప్పుడు ఇంటెలిజెంట్ అండ్ టాప్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్).. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒడిదొడుకుల వల్ల వ్యవస్థకు పూర్తిగా దూరమవుతుంది. అయితే, నగరంలోని ఒక బడా వ్యాపారవేత్త కూతురిని ఎవరో దారుణంగా హత్య చేయడంతో, రీటా మళ్లీ డ్యూటీలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమెకు తోడుగా ఇన్‌స్పెక్టర్ అర్జున్ సిన్హా (సూర్య శర్మ) వస్తాడు. అర్జున్ కూడా భార్యను కోల్పోయిన బాధలో, తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సీరియల్ కిల్లర్ కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. మరి ఆ క్రిమినల్ దొరికాడా? లేదా? అన్నది బ్రౌన్ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
పూర్తిగా డిఫరెంట్
కరిష్మా కపూర్ సినీ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన, భావోద్వేగాలతో కూడిన పాత్ర ఇదని చెప్పవచ్చు. 2020లో 'మెంటల్‌హుడ్' సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ నటి, ఆ తర్వాత 'మర్డర్ ముబారక్' చిత్రంలో మెరిసింది. కానీ, 'బ్రౌన్' సిరీస్‌లో ఆమె పోషించిన రీటా బ్రౌన్ పాత్ర వాటన్నింటికంటే పూర్తి భిన్నమైనది, చీకటి కోణాలతో కూడినదని చెప్పొచ్చు.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బ్రౌన్ వెబ్ సిరీస్ ఇప్పటికే ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జరిగిన 'బెర్లినాల్ సిరీస్ మార్కెట్ సెలెక్ట్స్ 2023' (Berlinale Series Market Selects 2023)కు ఎంపికైన ఏకైక భారతీయ వెబ్ సిరీస్‌గా ఇది రికార్డు సృష్టించింది.
అభీక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' అనే నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. 'ఢిల్లీ బెల్లీ' ఫేమ్ అభినయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను జీ స్టూడియోస్ నిర్మించింది. జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5)లో 'బ్రౌన్' సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'బ్రౌన్' వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
జవాబు: కరిష్మా కపూర్ నటించిన 'బ్రౌన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రశ్న: ఈ సిరీస్‌లో కరిష్మా కపూర్ పాత్ర ఏమిటి?
జవాబు: ఇందులో కరిష్మా కపూర్ కోల్‌కతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రీటా బ్రౌన్ అనే డిప్రెషన్, మద్యానికి బానిసైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది.
ప్రశ్న: 'బ్రౌన్' సిరీస్ దేని ఆధారంగా తెరకెక్కింది? దీని దర్శకుడు ఎవరు?
జవాబు: అభీక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' అనే పాపులర్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. దీనికి ప్రముఖ దర్శకుడు అభినయ్ దర్శకత్వం వహించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


