OTT Thriller: అక్కడ బ్యాంకు రాబరీ తమిళ థ్రిల్లర్..ఇక్కడ తెలుగు కామెడీ డ్రామా.. ఓటీటీని ఊపేస్తున్న సినిమాలు..ఓ లుక్కేయండి
OTT Thriller: ఓటీటీలో రెండు సినిమాలు అదరగొడుతున్నాయి. ఓ తమిళ బ్యాంకు రాబరీ థ్రిల్లర్, మరో తెలుగు కామెడీ డ్రామా ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ చిత్రాలపై ఓ లుక్కేయండి.
OTT Thriller: ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ లో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ మూవీ ఓటీటీలో సత్తాచాటుతున్నాయి. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. వ్యూస్ లో దూసుకుపోతున్నాయి. అందులో ఒకటి తమిళ రాబరీ థ్రిల్లర్ ‘కర’ కాగా.. మరొకటి తెలుగు కామెడీ డ్రామా ‘జెట్లీ’. ఒకటేమో నెట్‌ఫ్లిక్స్ లో, ఇంకోటి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

రాబరీ థ్రిల్లర్ కర
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘కర’. ఈ బ్యాంకు రాబరీ థ్రిల్లర్ ఓటీటీలో సత్తాచాటుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కర కొనసాగుతోంది. ఈ తమిళ థ్రిల్లర్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
బ్యాంకు రాబరీ
బ్యాంకు రాబరీల చుట్టూ సాగే థ్రిల్లర్ ఈ కర మూవీ. ఇందులో ధనుష్ ఓ దొంగగా నటించాడు. దొంగతనాలు అన్నీ మానేసి తన భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఓ హోటల్ స్టార్ట్ చేయాలని చూస్తాడు. కానీ అనుకోకుండా అతని తండ్రి చనిపోతాడు. ఆ పరిస్థితుల్లో హీరో మళ్లీ దొంగతనాలు మొదలెడతాడు. బ్యాంకులను టార్గెట్ చేస్తాడు.
కామెడీ డ్రామా జెట్లీ
ఓటీటీలో అదరగొడుతున్న ‘జెట్లీ’ మూవీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో కమెడియన్ సత్య హీరోగా నటించాడు. వెన్నెల కిశోర్, రియా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ఈ జెట్లీ మూవీని రితేష్ రాణా తెరకెక్కించాడు. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.
ఫ్లైట్ లో
జెట్లీ మూవీని ప్యూర్ కామెడీ చిత్రంగా రూపొందించారు. లాజిక్స్ పక్కనపెట్టి హాయిగా నవ్వించే సినిమా ఇది. ఇందులో మెజారిటీ పార్ట్ విమానంలోనే సాగుతోంది. ఓ స్కామ్ చేసిన బిజినెస్ మ్యాన్ విమానంలో వెళ్తాడు. అతణ్ని చంపాలని కొందరు, అరెస్ట్ చేయాలని పోలీసులు వెళ్తారు. అదే విమానంలో మతిమరుపుతో ఉన్న హీరో ఎలాంటి విన్యాసాలు చేశాడు? ఎలాంటి తిప్పలు పడ్డాడు? అన్నదే జెట్లీ మూవీ స్టోరీ.
వీకెండ్ కు బెస్ట్
రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కర, జెట్లీ సత్తాచాటుతున్నాయి. ఇంకా ఈ మూవీస్ ను చూడని ఓటీటీ లవర్స్ వెంటనే ఓ లుక్కేయండి. వీకెండ్ కు ఈ రెండు చిత్రాలు మంచి టైమ్ పాస్. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


