OTT Thriller: బ్యాంకుల్లో దొంగతనం.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్.. 8.1 రేటింగ్

OTT Thriller: కోలీవుడ్ స్టార్ ధనుష్, మమితా బైజు జంటగా నటించిన క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. 

Published on: May 28, 2026, 10:51:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Thriller: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇవాళ (మే 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ లేటెస్ట్ క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ లేటెస్ట్ క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్

కర ఓటీటీ

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘కర’ ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కర డిజిటల్ డెబ్యూ చేసింది.

నెల రోజుల్లోనే

కర మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో రిలీజైన ఈ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపించింది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్, మమితా బైజు జంటగా నటించారు. ఈ మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.

‘కర’ కథేంటి?

1990ల కాలం నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ హీస్ట్ థ్రిల్లర్‌గా ‘కర’ సినిమాను రూపొందించారు. ఇందులో కర స్వామి అనే ఓ దొంగ పాత్రలో ధనుష్ నటించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం దొంగతనాలు వదిలేసి కష్టపడి బతకాలని కర స్వామి అనుకుంటాడు. భార్యతో కలిసి ఓ హోటల్ పెట్టి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం పొలం పేపర్లు తాకట్టు పెట్టాలని చూస్తాడు.

భూమి పట్టా పాస్ బుక్ ల కోసం కర ఊరికి వెళ్తాడు. కానీ అతని తండ్రి అనుకోకుండా చనిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కర మళ్లీ దొంగగా మారతాడు. వరుసగా బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తాడు. అసలు కర మళ్లీ ఎందుకు దొంగగా మారాడు? బ్యాంకులనే ఎందుకు టార్గెట్ చేశాడు? అన్నది కర మూవీలో చూడాల్సిందే.

బాక్సాఫీస్ వసూళ్లు ఎంతంటే?

థియేటర్లలో విడుదలైన సమయంలో కర సినిమా మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోయింది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ ‘సక్నిల్క్’ నివేదిక ప్రకారం.. ‘కర’ చిత్రం భారతదేశంలో రూ.37.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.53.65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ధనుష్ నటించిన ‘కర’ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?

‘కర’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

2. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

ఈ చిత్రం మే 28, 2026 (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

3. ‘కర’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.53.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారత్‌లో రూ.37.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More