OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు క్రేజీ వెబ్ సిరీస్‌లు.. మిస్టరీ ఫ్యామిలీ డ్రామా.. సూపర్ హీరో థ్రిల్లర్

OTT Telugu: మిడ్ వీక్ లో ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్  చేసేందుకు రెండు క్రేజీ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇవాళ నుంచి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: May 27, 2026, 13:51:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: ఓటీటీ లవర్స్ కు అదిరే న్యూస్. ఇవాళ రెండు వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవి రెండు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. ఇందులో ఒకటి ప్యూర్ ఫ్యామిలీ మిస్టరీ డ్రామా ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ కాగా.. మరొకటి సూపర్ హీరో థ్రిల్లర్ ‘స్పైడర్ నోయిర్’. ఈ రెండు వెబ్ సిరీస్ లు తెలుగులోనూ డిజిటల్ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు వెబ్ సిరీస్ లు (x)
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు వెబ్ సిరీస్ లు (x)

బ్రదర్స్ అండ్ సిస్టర్స్

సరికొత్త తమిళ వెబ్ సిరీస్ ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’. ఇది ఈ రోజు (మే 27) నుంచి జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో బోస్ వెంకట్, గాయత్రి, రాజ్ అయ్యప్ప, తేజంక్, అపూర్వ రావు ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రతి వారం

బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాలుగు ఎపిసోడ్లు ఇవాళ జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యాయి. ఇక ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది. చిదంబరం మణివణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ సిరీస్‌ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు.. వారి వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, ఎమోషనల్ సంఘర్షణల చుట్టూ ఈ కథ సాగుతుంది.

ఆ మిస్టరీ

బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెబ్ సిరీస్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అయితే మధ్యలో కథ ఊహించని ట్విస్ట్ తీసుకుంటుంది. కుటుంబ పెద్దకు సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. మరి ఆ సీక్రెట్ ఏంటీ? దాని వెనుకాల ఉన్న మిస్టరీ ఏంటీ? అన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది చాలా ఆసక్తికరంగా చూపించారు.

స్పైడర్ నోయిర్

సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఇప్పుడు అలాంటి కథతోనే స్పైడర్ నోయిర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ బుధవారం నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్లు ఒకేసారి వచ్చేశాయి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.

రెగ్యులర్ స్టోరీ కాదు

ఈ వెబ్ సిరీస్ పేరులో స్పైడర్ ఉంది కానీ ఇది రెగ్యులర్ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ కథలా ఉండదు. ఇది 1930ల నాటి న్యూయార్క్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక డార్క్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. వయసు పైబడిన, జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కథ ఇది. అతను తన నగరంలో జరిగే క్రైమ్స్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తూ, స్పైడర్ మ్యాన్‌గా ఎలా మారాడనేది చాలా డిఫరెంట్‌గా చూపించారు.

సాధారణ స్పైడర్ మ్యాన్ సినిమాల్లాగా ఇది కలర్‌ఫుల్‌గా ఉండదు. 1930ల నాటి క్లాసిక్ క్రైమ్ నవలల తరహాలో.. లాంగ్ కోట్, హ్యాట్ వేసుకుని, ఒక గన్‌ పట్టుకుని తిరిగే డార్క్ క్యారెక్టర్ ఇది. గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్ కూడా చాలా రా అండ్ రస్టిక్ స్టైల్‌లో ఉంటాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More