ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయా రికార్డు.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్‌తో సరికొత్త చరిత్ర

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' సంచలనం సృష్టిస్తోంది. 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో ఓటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాంగ్ ఫార్మాట్ సిరీస్‌లలో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Published on: May 26, 2026, 16:30:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ రంగంలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లదే హవా. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్, ఊహించని మలుపులతో వస్తున్న వెబ్ సిరీస్‌లకు విశేష స్పందన లభిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఎన్నో రకాల కంటెంట్ వస్తున్నప్పటికీ, ఇన్వెస్టిగేటివ్ కథల వైపే తెలుగు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.

ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయా రికార్డు.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్‌తో సరికొత్త చరిత్ర
ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయా రికార్డు.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్‌తో సరికొత్త చరిత్ర

సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' (Dhoolpet Police Station). ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ రికార్డులు

స్ట్రీమింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. చూస్తుండగానే అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌ ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసింది. ఈ అద్భుతమైన విజయాన్ని ఆహా యాజమాన్యం అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. స్ట్రీమింగ్ మినిట్స్ పరంగా చూసుకుంటే ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా ఇది నిలుస్తుందని మేకర్స్ సగర్వంగా చెబుతున్నారు.

"250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ తన అప్రతిహత యాత్రను కొనసాగిస్తోంది. ఓటీటీలో బిగ్గెస్ట్ లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది" అని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. ఈ అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ కథను చారిత్రాత్మకం చేసినందుకు ప్రేక్షకులకు సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ విశేషాలు

హైదరాబాద్‌లోని ఓ లోకల్ బస్తీ నేపథ్యంగా, రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ కథ ప్రేక్షకులను తీవ్రంగా ఆకర్షిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పద్ధతులు, నేరస్తుల మైండ్ గేమ్, లోకల్ పాలిటిక్స్.. ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు ఎంతో సహజంగా తెరమీద ఆవిష్కరించారు. వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కారణంగానే ప్రేక్షకులు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు బింజ్ వాచ్ చేస్తున్నారు.

సాధారణంగా ఒక సిరీస్ హిట్ అయితే కొద్ది రోజులు మాత్రమే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' మాత్రం రోజురోజుకూ వ్యూయర్‌షిప్ పెంచుకుంటూ పోతోంది. లాంగ్ ఫార్మాట్ అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగడమే ఈ సిరీస్ సక్సెస్ సీక్రెట్. సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్. మీరు ఇంకా ఈ సిరీస్ చూడకపోతే వెంటనే 'ఆహా' ఓటీటీలో చూసేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ ఏ ఓటీటీలో ఉంది?

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha)లో స్ట్రీమ్ అవుతోంది.

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్ సృష్టించిన కొత్త రికార్డు ఏమిటి?

ఈ వెబ్ సిరీస్ 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి, ఆహా ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ సిరీస్ ఏ జానర్‌కు చెందుతుంది?

ఇది పూర్తిగా రా అండ్ రస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. లాంగ్ ఫార్మాట్ కథనంతో, సీట్ ఎడ్జ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More