OTT Crime: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్- హీరోయిన్ సోనాలి బింద్రే రీఎంట్రీ- తెలుగులోనూ!
Sonali Bendre Crime Thriller Raakh OTT Streaming: తెలుగు స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే నటించిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ రాఖ్ ఓటీటీలోకి వచ్చేయనుంది. మరికొన్ని గంటల్లో తెలుగులో కూడా రాఖ్ ఓటీటీ రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో రాఖ్ రెండో ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. రాఖ్ ఓటీటీ రిలీజ్ ఎక్కడంటే?.
Sonali Bendre Crime Thriller Raakh OTT Release Telugu: ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. సస్పెన్స్, ఎమోషన్ కలగలిపిన ఇన్వెస్టిగేషన్ కథలను ఓటీటీ ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు.

రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ సీనియర్ నటి, తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాలి బింద్రే, బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ సిరీస్ 'రాఖ్' (Raakh).
జూన్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న రాఖ్ సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ ముంబైలో ఇటీవల విడుదల చేశారు. 1970ల కాలం నాటి భయంకరమైన నేరాలు, వాటి వెనుక ఉన్న మానసిక సంఘర్షణల నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ సాగనుంది.
టాలీవుడ్ ఫేవరెట్ సోనాలి..
ఒకప్పుడు టాలీవుడ్‌లో మహేశ్ బాబు 'మురారి', చిరంజీవి 'ఇంద్ర', నాగార్జున 'మన్మధుడు' వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సోనాలి బింద్రే. సుదీర్ఘ విరామం తర్వాత సోనాలి బింద్రే ఇలా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడంతో సౌత్ ఇండస్ట్రీలోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సరికొత్త రోల్‌లో గుడ్డు భయ్యా
మరోవైపు ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'లో గ్యాంగ్‌స్టర్ 'గుడ్డు భయ్యా'గా రఫ్ అండ్ టఫ్ యాక్టింగ్‌తో మెప్పించిన అలీ ఫజల్.. ఇందులో పూర్తిగా భిన్నమైన రోల్‌లో కనిపించనున్నాడు. నేరస్థులను వేటాడే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్ఐ జయప్రకాష్) పాత్రలో ఆయన నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
గూస్‌బంప్స్ తెప్పించే సైకో క్రైమ్ మిస్టరీ
విమర్శకుల ప్రశంసలు పొందిన 'పాతాళ్ లోక్' సిరీస్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇటీవల విడుదలైన రాఖ్ రెండో ట్రైలర్ చూస్తుంటే ఇదొక సాధారణ క్రైమ్ స్టోరీ కాదని స్పష్టమవుతోంది. ఒక భయంకరమైన నవ్వు, తీక్షణమైన కళ్ల క్లోజప్ షాట్‌తో ట్రైలర్ ప్రారంభమై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
బాబు (ఆకాష్ మఖిజా), రజ్జో (రమణ్‌దీప్ యాదవ్) అనే ఇద్దరు వికృత మనస్తత్వం గల సైకో నేరస్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారు చేసే దారుణాలు దేశాన్ని ఎలా కుదిపేశాయి, వారిని పట్టుకోవడానికి ఎస్ఐ జయప్రకాష్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది ట్రైలర్‌లో కంటికి కట్టినట్లు చూపించారు.
కాలంతో పోటీ పడుతూ పోలీస్ ఆఫీసర్ చేసే ఈ క్రైమ్ వేట థ్రిల్ ఇస్తుండగా, నిందితుల గతం వెనుక ఉన్న ఎమోషనల్ యాంగిల్ ఆలోచింపజేసేలా ఉంది. ఎండీమాల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాళిని జైన్, శ్యామ్ రాఠీ ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
కేవలం క్రైమ్ మాత్రమే కాదు.. ఎమోషనల్ జర్నీ
ఈ ఓటీటీ సిరీస్ గురించి కథా రచయితలు, సహ దర్శకులు అనుషా నందకుమార్, సందీప్ సాకేత్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఒక అద్భుతమైన క్రైమ్ స్టోరీ చూసినప్పుడు కేవలం ఆ నేరం లేదా దర్యాప్తు మాత్రమే ప్రేక్షకుల గుర్తుండదు. అందులోని మానవీయ కోణాలు, భావోద్వేగాలు మాత్రమే ఎక్కువ కాలం మనసులో నిలిచిపోతాయి" అని డైరెక్టర్స్ అన్నారు.
"'రాఖ్' సిరీస్ ద్వారా మేము కేవలం మిస్టరీని మాత్రమే కాకుండా, ఒక నేరం జరిగిన తర్వాత బాధితుల జీవితాల్లో మిగిలే శోకం, అపరాధ భావం, కోపం వంటి అంశాలను టచ్ చేశాం. నేరం ఎవరు చేశారు అనేదానికంటే, ఆ నేరం తర్వాత వెనుక మిగిలిన వారి జీవితాలు ఏమయ్యాయి అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ" అని దర్శకులు పేర్కొన్నారు.
ఈ సిరీస్‌లో అమీర్ బషీర్, రాకేష్ బేడీ, దిబ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆయుష్ త్రివేది అందించిన డైలాగ్స్ క్యారెక్టర్ల తీవ్రతను పెంచాయి. హిందీ భాషలో ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాఖ్ రూపొందింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రాఖ్ ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాఖ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్- మరికొన్ని గంటల్లో
అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తెలుగులో కూడా రాఖ్ ఓటీటీ రిలీజ్ అవనుంది. వీకెండ్‌లో అదిరిపోయే సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


