Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మరో సూపర్ వెబ్ సిరీస్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నిర్మాతగా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Jiohotstar: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ డిజిటల్ ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ రిలీజ్ డేట్ ఖరారైంది. జూలై 3 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Published on: May 19, 2026, 16:43:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jiohotstar: బాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న క్రేజీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే, సంజూ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. నిర్మాతగా ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమయ్యారు. ‘హాట్‌స్టార్ స్పెషల్స్’గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్ పేరు ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’.

Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మరో సూపర్ వెబ్ సిరీస్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నిర్మాతగా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మరో సూపర్ వెబ్ సిరీస్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నిర్మాతగా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రీతమ్ అండ్ పెట్రో ఓటీటీ రిలీజ్ డేట్

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జులై 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియోహాట్‌స్టార్’లో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. సినిమా రంగంలో తనదైన క్లాసిక్ కామెడీ, ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేసే హిరానీ.. ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేయడంతోపాటు ప్రొడ్యూస్ చేశారు. దీంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జియోహాట్‌స్టార్ సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్‌న్యూస్ చెబుతూ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను పంచుకుంది. "రాజ్‌కుమార్ హిరానీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్.. మీకోసం సరికొత్త వినోదం సిద్ధమైంది. జులై 3 నుంచి ప్రీతమ్ అండ్ పెడ్రో స్ట్రీమింగ్ కానుంది.. కేవలం జియోహాట్‌స్టార్‌లో మాత్రమే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇంట్రెస్టింగా పోస్టర్

ఈ ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ పోస్టర్ ఆసక్తికంగా ఉంది. ఓ ఏటీఎం మెషీన్ కు ఓవైపు ఓ వ్యక్తి, మరోవైపు పోలీసు నిల్చొన్నట్లుగా చూపించారు. అవినాష్ అరుణ్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఇదో ఇంట్రెస్టింగ్ ఏటీఎం దోపిడీ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోంది.

సాధారణంగా రాజ్‌కుమార్ హిరానీ కథల్లో బలమైన మానవీయ సంబంధాలు, సమాజానికి అవసరమైన ఒక మంచి సందేశం, దానికి తోడు కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంటాయి. ఈ సిరీస్‌లో కూడా అదే మార్క్ హ్యూమర్, ఎమోషన్స్ ఉంటాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటివరకు వెండితెరపైనే తన హవా చూపించిన ఈ స్టార్ డైరెక్టర్.. మొదటిసారి ఓటీటీ ఫార్మాట్‌లో కథను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. జియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం తర్వాత వస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి కావడంతో డిజిటల్ మార్కెట్లో దీనిపై భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి. జులై 3న విడుదల కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవరు?

జవాబు: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేస్తుండగా అవినాష్ అరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నిర్మాతగా హిరానీకి ఇదే తొలి వెబ్ సిరీస్.

ప్రశ్న: ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ఎప్పటినుంచి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?

జవాబు: ఈ సిరీస్ జులై 3వ తేదీ నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More