OTT Bold: బోల్డ్ వెబ్ సిరీస్‌లోకి బిగ్ బాస్ దివి ఎంట్రీ- మ‌రి కొన్ని గంట‌ల్లోనే స్ట్రీమింగ్‌-ఓటీటీ ట్రెండ్ సీక్రెట్ ఇదే!

OTT Bold: సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ నటిగా, హీరోయిన్ గా సాగిపోతోంది బిగ్ బాస్ ఫేమ్ దివి. ఈ భామ ఇప్పుడు ఓటీటీ బోల్డ్ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్ మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటీ? ఓటీటీ బోల్డ్ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Jun 11, 2026, 13:44:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Bold: ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ వేదిక 'ఆహా' (Aha Video) లో భారీ వ్యూయర్‌షిప్ సాధించిన బోల్డ్ అంథాలజీ సిరీస్ ‘ష్’ (Sshhh) సరికొత్త సీజన్‌తో సిద్ధమైంది. పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన సీజన్ 3 ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరికొన్ని గంటల్లో రానుంది. ఈ బోల్డ్ సిరీస్ లోకి దివి ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బోల్డ్ వెబ్ సిరీస్‌లోకి బిగ్ బాస్ దివి ఎంట్రీ- మ‌రి కొన్ని గంట‌ల్లోనే స్ట్రీమింగ్‌ (x/ahatamil)
బోల్డ్ వెబ్ సిరీస్‌లోకి బిగ్ బాస్ దివి ఎంట్రీ- మ‌రి కొన్ని గంట‌ల్లోనే స్ట్రీమింగ్‌ (x/ahatamil)

ష్ సీజన్ 3 ఓటీటీ

ఓటీటీలోని పాపులర్ బోల్డ్ వెబ్ సిరీస్ ల్లో ‘ష్’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ష్ సీజన్ 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

మరి దివి ఈ సిరీస్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? అసలు గ్లోబల్ ఓటీటీలకు పోటీగా రీజనల్ ప్లాట్‌ఫామ్స్ ఇలాంటి బోల్డ్ కంటెంట్‌ను ఎందుకు నమ్ముకుంటున్నాయి? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ అనాలసిస్ ఇక్కడ చూద్దాం.

‘ష్’ ఫ్రాంచైజీ

పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు వందల కోట్లు కుమ్మరిస్తున్న తరుణంలో.. ‘ఆహా’ లాంటి ప్రాంతీయ ఓటీటీలు కంటెంట్ వైవిధ్యంతో పాటు ‘బోల్డ్ అండ్ రొమాంటిక్’ జోనర్‌ను గట్టిగా క్యాష్ చేసుకుంటున్నాయి. మోడ్రన్ రిలేషన్‌షిప్స్, సాన్నిహిత్యం, సామాజిక కట్టుబాట్లను బద్దలుకొట్టడం అనే గీతపై నడిచే ‘ష్’ సిరీస్ మూడు సీజన్ల ప్రయాణం టాలీవుడ్ డిజిటల్ మార్కెట్‌లో ఒక సరికొత్త కేస్ స్టడీ అని చెప్పొచ్చు.

ట్రేడ్ లెక్కలు ఇవే

ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ఆహా వంటి రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రతి వారం పెద్ద సినిమాలు అందుబాటులో ఉండవు. సబ్‌స్క్రిప్షన్లను నిలబెట్టుకోవాలన్నా, కొత్త యూజర్లను ఆకర్షించాలన్నా తక్కువ బడ్జెట్‌లో హై-ఎంగేజ్‌మెంట్ ఇచ్చే కంటెంట్ అవసరం.

హిందీ డిజిటల్ మార్కెట్‌లో 'లస్ట్ స్టోరీస్' లేదా 'ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ' కంటెంట్ ఎలాంటి విప్లవం తెచ్చిందో.. సౌత్‌లో 'ఆహా' అదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. యువతను, అడల్ట్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించే ఈ సిరీస్‌లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ 'వాచ్ టైమ్ లభిస్తుంది.

దివి అందుకే

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ క్వీన్స్‌గా వెలిగిన పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్ వంటి సీనియర్ నటీమణులతో పాటు, బిగ్ బాస్ ద్వారా యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న దివి వాద్యా లాంటి యంగ్ జనరేషన్ తారలను ఈ సీజన్ 3 లోకి తీసుకురావడం. పెద్ద తెరపై అవకాశాలు తగ్గిన నటీమణులకు ఓటీటీ స్పేస్ ఒక అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ వేదికగా మారుతోంది.

పాత్రల పరిధి దాటి నటించే స్వేచ్ఛ ఉండటంతో పాటు క్రేజీ రెమ్యునరేషన్లు లభిస్తుండటంతో మేకర్స్ ఈ విధమైన కాస్టింగ్ ఫ్లిప్ చేస్తున్నారు. ఇక సినిమాల్లో తనను తాను నిరూపించుకున్న దివి.. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటేందుకు ఈ సిరీస్ ను ఎంచుకుందని చెప్పొచ్చు.

People Also Aks: తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

బోల్డ్ వెబ్ సిరీస్ ష్ సీజన్ 3 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?

ఈ బోల్డ్ రొమాంటిక్ అంథాలజీ సిరీస్ జూన్ 12, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా (Aha Video) లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ష్ సీజన్ 3ను ఫ్యామిలీతో చూడవచ్చా?

లేదు. ఇది పూర్తిగా ఒక 'బోల్డ్ అండ్ రొమాంటిక్' అడల్ట్ అంథాలజీ సిరీస్. ఇందులో శృంగారం, మానవ సంబంధాలలోని బోల్డ్ కోణాలు, సామాజిక సున్నితమైన అంశాలు ఉంటాయి. కాబట్టి దీనిని పిల్లలతో కలిసి చూడటం సమంజసం కాదు.

ష్ సీజన్ 3లో ఎవరు నటిస్తున్నారు?

ఈ మూడో సీజన్‌లో సీనియర్ గ్లామర్ నటీమణులు పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్‌లతో పాటు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా (Divi Vadthya), దివ్య గణేశన్ కీలక పాత్రలు పోషించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More