OTT: 6 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఓటీటీ బోల్డ్ బ్యూటీ- ఓటీటీలతో స్వేచ్ఛ వచ్చిందన్న మాన్వీ గాగ్రూ- మగాళ్లు ఏం చేయరంటూ!

Actress Maanvi Gagroo On OTTs Women Centric Films: ఓటీటీ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఫేమ్ మాన్వీ గాగ్రూ నటించిన రోడ్ ట్రిప్ డ్రామా హీర్ సారా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో మహిళా చిత్రాలపై ఉన్న వివక్ష, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నటీనటులకు ఇచ్చిన స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Jun 8, 2026, 10:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Actress Maanvi Gagoo On OTTs And Women Centric Films: ఒకప్పుడు డిస్నీ ఛానల్ 'ధూమ్ మచావో ధూమ్' సిరీస్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్వీ గాగ్రూ నేడు భారతీయ ఓటీటీ స్క్రీన్లపై మోస్ట్ పాపులర్ ఫేస్‌గా ఎదిగారు.

6 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఓటీటీ బోల్డ్ బ్యూటీ- ఓటీటీలతో స్వేచ్ఛ వచ్చిందన్న మాన్వీ గాగ్రూ- మగాళ్లు ఏం చేయరంటూ!
6 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఓటీటీ బోల్డ్ బ్యూటీ- ఓటీటీలతో స్వేచ్ఛ వచ్చిందన్న మాన్వీ గాగ్రూ- మగాళ్లు ఏం చేయరంటూ!

ఓటీటీ బోల్డ్ సిరీస్

ఓటీటీ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్', 'ట్రిప్లింగ్', 'టీవీఎఫ్ పిచర్స్' వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఆడియన్స్‌కు విపరీతమైన వినోదాన్ని పంచిన మాన్వీ గాగ్రూ, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు.

ఆరేళ్ల తర్వాత

ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (2020) తర్వాత మాన్వీ గాగ్రూ థియేట్రికల్ సినిమాలో కనిపించలేదు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పత్రలేఖతో కలిసి మాన్వీ నటించిన ఉమెన్ లీడ్ రోడ్-ట్రిప్ డ్రామా 'హీర్ సారా' జూన్ 12, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో పాపులర్ మీడియా సంస్థ 'హిందుస్థాన్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటీటీ రెవల్యూషన్, సినిమా ఇండస్ట్రీలో మహిళలపై ఉన్న వివక్షపై ఓటీటీ బోల్డ్ సిరీస్ బ్యూటీ మాన్వీ గాగ్రూ మనసు విప్పి మాట్లాడారు.

హీర్ పాత్ర కోసం దర్శకుడితో కలిసి పయనం

హీర్ సారా సినిమాలో తన పాత్ర గురించి మాన్వీ మాట్లాడుతూ, లౌడ్ లేదా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించకుండా ఒక బబ్లీ క్యారెక్టర్‌ను పండించడం కత్తిమీద సాము లాంటిదన్నారు. "హీర్ పాత్ర చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఆ ఉత్సాహం ప్రేక్షకులకు చిరాకు తెప్పించకూడదనే భయం నన్ను వెంటాడింది. అందుకే ఆ పాత్ర డైలాగ్ డెలివరీ, వాయిస్ బ్యాలెన్స్ కోసం రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ చౌదరితో కలిసి ప్రతి రోజూ వర్క్ చేశాను" అని మాన్వీ వివరించారు.

షూటింగ్ ప్రారంభంలో తాను చాలా సాఫ్ట్‌గా నటించానని, అయితే డైరెక్టర్ మరికొంత ఎనర్జీని ఆశించారని మాన్వీ చెప్పారు. ఒక పాత్రను అర్థం చేసుకోవడం అనేది షూటింగ్ సాగుతున్న కొద్దీ మెరుగవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఓటీటీ ఇచ్చిన ఎంపిక స్వేచ్ఛ

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రాకముందు నటీనటులకు కేవలం టెలివిజన్ లేదా సినిమాలు మాత్రమే ప్రత్యామ్నాయాలుగా ఉండేవి. ఆర్థిక మనుగడ కోసం ఎలాంటి పాత్రలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చేది. "ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నాలాంటి నటీనటులకు తెచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. సినిమా కాబట్టి ఏదో ఒక రోల్ చేసేయాలనే ఆకలి ఇప్పుడు లేదు. మాకు నచ్చిన కథలను ఎంచుకునే లగ్జరీని ఓటీటీలు కల్పించాయి" అని మాన్వీ స్పష్టం చేశారు.

కేవలం స్క్రీన్ స్పేస్ కోసం కాకుండా, జెండర్ పాలిటిక్స్ (మహిళల ప్రాధాన్యత) సరిగ్గా లేని స్క్రిప్టులను, కథకు ఎటువంటి విలువ జోడించని పాత్రలను తాను నిర్మొహమాటంగా తిరస్కరించడం వల్లే ఈ ఆరేళ్ల గ్యాప్ వచ్చిందని మాన్వీ గాగ్రూ వెల్లడించారు.

'చిక్ ఫ్లిక్' ట్యాగ్‌లపై తీవ్ర అసంతృప్తి

చిత్ర పరిశ్రమలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలపై మాన్వీ ఘాటుగా స్పందించారు. హీరోలు ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలను కేవలం 'సినిమా' అని పిలుస్తారని, అదే మహిళలు లీడ్ రోల్స్ చేస్తే 'ఫీమేల్ సెంట్రిక్' ప్రాజెక్ట్ అని ముద్ర వేస్తారని ఆమె ఆక్షేపించారు.

"ట్యాగ్‌లు ఉండటంలో తప్పు లేదు. కానీ ఒక ట్యాగ్‌ను గొప్పగా, ఇంకో దాన్ని తక్కువగా చూడటమే అసలు సమస్య. మహిళలు ఇష్టపడే సినిమాలను 'చిక్ ఫ్లిక్' అని ఈజీగా కొట్టేస్తారు. అదే పురుషులు చూసే యాక్షన్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు. సమాజంలో మహిళలు ఇష్టపడే ఫ్యాషన్, మేకప్, టీవీ షోలు, కిట్టీ పార్టీలను ఎగతాళి చేసే ధోరణి మారాలి" అని మాన్వీ గాగ్రూ డిమాండ్ చేశారు.

గొంతు విప్పుతున్న మహిళా ఫ్యాన్స్

తమ సూపర్ హిట్ సిరీస్ 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' మూడు సీజన్‌ల ప్రయాణంలో మహిళల ఆలోచనల్లో వచ్చిన మార్పును ఆమె ఉదాహరణగా చూపించారు. మొదటి సీజన్ వచ్చినప్పుడు మహిళలు రహస్యంగా వచ్చి షో బాగుందని చెప్పేవారని, రెండో సీజన్ సమయానికి తమ భర్తలు, బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి చూడటం ప్రారంభించారని ఆమె గుర్తుచేసుకున్నారు.

"మూడో సీజన్ వచ్చేసరికి మహిళలు ఎవరికీ భయపడకుండా, సమాజం ఏమనుకున్నా పర్లేదు అన్నట్లుగా ఓపెన్‌గా షోను ఓనర్‌షిప్ తీసుకున్నారు. మహిళల కోసం ఇలాంటి కంటెంట్ మరిన్ని రావాలి. చిత్ర పరిశ్రమ తనంతట తానుగా మారదు, మగవాళ్లు మనకోసం ఏం చేయరు. మహిళలమే ఆ మార్పును సాధించాలి" అని మాన్వీ పిలుపునిచ్చారు.

ఓటీటీ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్‌లో మాన్వీ గాగ్రూ (Prime Video)
ఓటీటీ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్‌లో మాన్వీ గాగ్రూ (Prime Video)

హీర్ సారా కథ

ఇదిలా ఉంటే పొండిచ్చేరి నేపథ్యంలో సాగే 'హీర్ సారా' సినిమా కూడా ఇద్దరు భిన్నమైన మహిళల మధ్య స్నేహాన్ని, ఆత్మశోధనను అద్భుతంగా ఆవిష్కరిస్తుందని ఆమె ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More