OTT Telugu Today: ఓటీటీ సినీ ఫెస్టివల్- ఇవాళ ఒక్కరోజే తెలుగులో 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు- దేశభక్తి నుంచి బోల్డ్ మూవీ!

OTT Release Movies Telugu Today: ఓటీటీలో ఇవాళ సినీ ఫెస్టివల్ అనొచ్చు. జూన్ 5 ఒక్కరోజే తెలుగులో ఏకంగా 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సన్ హాట్‌స్టార్‌లలో దేశభక్తి నుంచి బోల్డ్ థ్రిల్లర్ వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Jun 5, 2026, 13:43:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu Releases Today: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటీటీ కంటెంట్‌కు బానిసలవుతున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు కూడా డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీ సినీ ఫెస్టివల్- ఇవాళ ఒక్కరోజే తెలుగులో 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు- దేశభక్తి నుంచి బోల్డ్ మూవీ!
ఓటీటీ సినీ ఫెస్టివల్- ఇవాళ ఒక్కరోజే తెలుగులో 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు- దేశభక్తి నుంచి బోల్డ్ మూవీ!

జూన్ 5వ తేదీన

దీనికి తోడు నేరుగా ఓటీటీ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూన్ 5వ తేదీన (శుక్రవారం) ఒక్కరోజే ఏకంగా 10 తెలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ ఓటీటీ తెలుగు సినిమాలు, వాటి జోనర్లు ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విభిన్న రుచులు

ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) జూన్ 5న మూడు విభిన్న చిత్రాలను తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చింది. అందులో మొదటిది "29". ఇది తమిళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. యువతకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక అమెరికన్ కల్చర్ ఇష్టపడే వారి కోసం "ఆఫీస్ రొమాన్స్" అనే హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. కొరియన్ డ్రామాలకు (K-Dramas) మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నెట్‌ఫ్లిక్స్ "టీచ్ యూ ఏ లెసన్" అనే కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్‌ను తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5లో యాక్షన్ ధమాకా

జీ5 (ZEE5) ఓటీటీలో నేటి శుక్రవారం రెండు భారీ డబ్బింగ్ సినిమాలను విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్టయిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "పేట్రియాట్" తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుందని ఆశించవచ్చు.

అలాగే, కన్నడ ఇండస్ట్రీ నుంచి పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా "కేడీ ది డెవిల్" కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, నోరా ఫతేహి, శిల్పా శెట్టి యాక్టర్స్ నటించిన ఈ సినిమా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

సన్ నెక్ట్స్‌లో పీరియాడిక్ డ్రామా

కన్నడలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "ది రైజ్ ఆఫ్ అశోక" తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను సన్ నెక్ట్స్ (Sun NXT) విడుదల చేసింది. దీనితో పాటు, యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మాస్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ "మెకానిక్ రాకీ" కూడా సన్ నెక్ట్స్‌లో జూన్ 5 నుంచి అందుబాటులో ఉంటోంది.

హాట్‌స్టార్‌లో ధురంధర్ 2

జియో హాట్‌స్టార్ (Jio Hotstar) స్పై యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల కోసం "ధురంధర్ 2: ది రివేంజ్" అనే హిందీ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చేసింది. మొదటి భాగంతోపాటు ఈ సీక్వెల్ కూడా భారీ విజయం అందుకుంది. సుమారు రూ. 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది ధురంధర్ 2.

సోనీ లివ్ ఓటీటీలో

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపులర్ ఓటీటీ సిరీస్ "గుల్లాక్" (Gullak) సీజన్ 5. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలు, ఎమోషన్స్‌తో సాగే ఈ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సిరీస్ సోనీ లివ్ (Sony LIV)లో తెలుగు డబ్బింగ్‌తో జూన్ 5 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

'ఆహా'లో బోల్డ్ థ్రిల్లర్

పక్కా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఈ వారం ఒక ఆసక్తికరమైన స్ట్రయిట్ తెలుగు సినిమాతో వచ్చేసింది. "అగ్లీ స్టోరీ" అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన నందు, అవికా గోర్ మూవీ అగ్లీ స్టోరీ ఆహా ఓటీటీలో ఇవాళ రిలీజ్ అయింది.

సినిమా/సిరీస్ పేరుఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్ఓటీటీ రిలీజ్ డేట్
29 (మూవీ)నెట్‌ఫ్లిక్స్తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంజూన్ 5
ఆఫీస్ రొమాన్స్నెట్‌ఫ్లిక్స్తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్జూన్ 5
టీచ్ యూ ఏ లెసన్నెట్‌ఫ్లిక్స్తెలుగు డబ్బింగ్ కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్జూన్ 5
అగ్లీ స్టోరీఆహాతెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీజూన్ 5
పేట్రియాట్జీ5తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీజూన్ 5
కేడీ ది డెవిల్జీ5తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాజూన్ 5
ది రైజ్ ఆఫ్ అశోకసన్ నెక్ట్స్తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాజూన్ 5
మెకానిక్ రాకీసన్ నెక్ట్స్తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీజూన్ 5
ధురంధర్ 2: ది రివేంజ్జియో హాట్‌స్టార్తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంజూన్ 5
గుల్లాక్ సీజన్ 5సోనీ లివ్తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్జూన్ 5

ఇలా తొమ్మిది డబ్బింగ్, ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమాలతో శుక్రవారం ఓటీటీ ఫెస్టివల్‌గా మారింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జోనర్ల సినిమాలు తెలుగులో ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More