Funky OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన విశ్వక్ సేన్ అనుదీప్ కేవీ ఫంకీ- మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Funky OTT Release Platform: విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ మూవీ ఫంకీ. బ్యూటిపుల్ కయాదు లోహర్ హీరోయిన్‌గా చేసిన ఫంకీ నిన్న థియేటర్లలో విడుదలైంది. అయితే, మిక్స్‌డ్ టాక్ వస్తున్న క్రమంలో ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

Feb 14, 2026, 20:04:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఫంకీ. ఈ సినిమాలో బ్యూటిపుల్ అండ్ గ్లామర్ బ్యూటి కయాదు లోహర్ హీరోయిన్‌గా చేసింది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన విశ్వక్ సేన్ అనుదీప్ కేవీ ఫంకీ- మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన విశ్వక్ సేన్ అనుదీప్ కేవీ ఫంకీ- మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఫంకీ నిర్మాతలు

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఫంకీ సినిమాను నిర్మించారు. అలాగే, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించారు.

నిన్న థియేటర్లలో రిలీజ్

టీజర్, ట్రైలర్‌తో కామెడీ తెప్పించిన ఫంకీ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిన్న అంటే ఫిబ్రవరి 13 థియేటర్లలో విడుదల అయింది. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. నవ్వుకునేందుకు కామెడీ ఉన్న అది కంప్లీట్‌గా లేదనే ఫీలింగ్ ఆడియెన్స్‌కు కలుగుతోంది.

ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్

స్టోరీ, లాజిక్ వంటి విషయాలు పట్టించుకోవద్దని, కేవలం నవ్వుకోడానికి మాత్రమే ఫంకీ సినిమాకు రావాలని నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్‌లో చెప్పారు. అయితే, సినిమా మొత్తం నవ్వుకునేలా లేదని పలువురు రివ్యూవర్స్ చెబుతున్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోన్న ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఫంకీ ఓటీటీ రైట్స్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. అయితే, ఫంకీ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ మంచి ధరనే వెచ్చిందని టాక్. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే ఫంకీ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్

సినిమాకు వస్తున్న మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్, కలెక్షన్స్, ఇతరత్రా కారణాలతో ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆధారపడనున్నాయి. రెగ్యులర్ ఓటీటీ డీల్స్ ప్రకారం ఫంకీ మూవీ కూడా థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫంకీ బడ్జెట్

ఇదిలా ఉంటే, ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌తోపాటు వీకే నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్, టెక్నిషియన్స్ రెమ్యూనరేషన్ ఇతరత్రా ఖర్చులంతా కలిపి ఫంకీ సినిమాకు మొత్తంగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.

ఫంకీ థియేట్రికల్ బిజినెస్

ఇక, ఫంకీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్ల వరకు అయ్యాయి.

ఫంకీ హిట్ కొట్టాలంటే?

ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా ఫంకీ సినిమాకు రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే, ఫంకీ సినిమా హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 14 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్, రూ. 28 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. మరి ఫంకీ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More