తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూల్లు వస్తాయి: సూర్యదేవర నాగవంశీ కామెంట్స్- అది మర్చిపోయేలా చేసిందన్న మీనాక్షి చౌదరి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంది. సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 18, 2026, 07:01:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూడు వరుస విజయాల తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చిన లేటెస్ట్ విలేజ్ కామెడీ డ్రామా మూవీ అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో హీరోకు జోడీగా హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూల్లు వస్తాయి: సూర్యదేవర నాగవంశీ కామెంట్స్- అది మర్చిపోయేలా చేసిందన్న మీనాక్షి చౌదరి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూల్లు వస్తాయి: సూర్యదేవర నాగవంశీ కామెంట్స్- అది మర్చిపోయేలా చేసిందన్న మీనాక్షి చౌదరి

జనవరి 14న థియేటర్లలో

నూతన దర్శకుడు మారి డైరెక్టర్‌గా పరిచయం అయిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోన్నసందర్భంగా అనగనగా ఒక రాజు సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నమ్మకంగా ఉన్నాం

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "అనగనగా ఒక రాజు సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాము. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. అన్ని చోట్లా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది" అని అన్నారు.

చివరిలో ఎమోషన్‌కి

"ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు వస్తాయి" అని ప్రొడ్యూసర్ నాగవంశీ జోస్యం చెప్పారు.

కష్టాన్ని మర్చిపోయేలా చేసింది

ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మా సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ఫలితం మా అందరి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది" అని అన్నారు.

ఛాలెంజింగ్ పాత్ర

"నేను పోషించిన చారులత పాత్ర బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి తెలిపారు.

ప్రభాస్‌తో మొదలు

ఇదెలా ఉంటే, ఈ సంక్రాంతి 2026కి బాక్సాఫీస్ బరిలోకి తెలుగు నుంచే ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి. మొదటగా ప్రభాస్ ది రాజా సాబ్‌తో ప్రారంభమైన ఈ పోటీ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి దాకా కొనసాగింది.

చిరు, రవితేజ సినిమాలు కూడా

మెగాస్టార్ చిరంజీవి నుంచి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ ఫ్యామిలీ డ్రామా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కళకళలాడాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More