మీ బాధలన్నీ మర్చిపోయి 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, ప్రతి సీన్‌లో జోక్స్ పేలుతాయ్: అనగనగా ఒక రాజు డైరెక్టర్ మారి

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అనగనగా ఒక రాజు. డైరెక్టర్‌గా మారి పరిచయం అవుతున్న ఈ మూవీ సంక్రాంతికి జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jan 13, 2026, 19:08:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, బ్యూటిపుల్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. తెలుగులో ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే మారి డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.

మీ బాధలన్నీ మర్చిపోయి 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, ప్రతి సీన్‌లో జోక్స్ పేలుతాయ్: అనగనగా ఒక రాజు డైరెక్టర్ మారి
మీ బాధలన్నీ మర్చిపోయి 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, ప్రతి సీన్‌లో జోక్స్ పేలుతాయ్: అనగనగా ఒక రాజు డైరెక్టర్ మారి

జనవరి 14న విడుదల

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో అనగనగా ఒక రాజు విడుదల కానుంది.

న్యూ డైరెక్టర్ మారి కామెంట్స్

ఈ నేపథ్యంలో జనవరి 12న వరంగల్‌లో అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ డైరెక్టర్ మారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఎప్పటికీ రుణపడి ఉంటాను

చిత్ర దర్శకుడు మారి మాట్లాడుతూ.. "ముందుగా నేను కొంతమందికి థాంక్స్ చెప్పాలి. నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నానంటే దానికి ముఖ్య కారణం నవీన్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే అనుదీప్ గారికి ధన్యవాదాలు. ఆయనే నన్ను నవీన్ గారికి పరిచయం చేశారు. అలాగే సితార సంస్థకు కృతఙ్ఞతలు. వారికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని అన్నారు.

పర్‌ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్

"సినిమా చాలా బాగా వచ్చింది. పర్‌ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. సినిమా మొత్తం అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి సీన్‌లో జోక్స్ పేలుతూ ఉంటాయి. మీ కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకోవచ్చు" అని డైరెక్టర్ మారి చెప్పారు.

చక్కగా ఒదిగిపోయారు

"ఈ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీనాక్షి గారు చారులత పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. డీఓపీ యవరాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, ఎడిటర్ వంశీ అట్లూరి ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు" అని తెలిపారు మారి.

మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు

"మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్లిన తర్వాత.. మీ బాధలన్నీ మర్చిపోయి రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. జనవరి 14న కుటుంబంతో కలిసి థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకోండి" అని ధీమా వ్యక్తం చేశారు అనగనగా ఒక రాజు డైరెక్టర్ మారి.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కామెంట్స్

పశ్చిమ వరంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "హనుమకొండలో ఈ చిత్ర వేడుకను నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వయంకృషితో సినీ రంగంలో ఎదుగుతున్న పలువురు ప్రతిభావంతులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. విజయోత్సవ వేడుక కూడా హనుమకొండలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More