నా ఆరోగ్యం కొంచెం బాలేదు, అయినా మీకోసమే వచ్చాను- చిన్మయికి థ్యాంక్స్- వరంగల్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్
బ్యూటిపుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా జనవరి 12న జరిగిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు మరో మూవీతో ఈ సంవత్సరం సంక్రాంతికి రానుంది. ఆ సినిమానే అనగనగా ఒక రాజు.
నా ఆరోగ్యం కొంచెం బాలేదు, అయినా మీకోసమే వచ్చాను- చిన్మయికి థ్యాంక్స్- వరంగల్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్
దర్శకుడిగా మారి పరిచయం
టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా చేసిన అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. మారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 12న సాయంత్రం వరంగల్ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
చారులత పాత్రపై
వరంగల్‌లో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "ఈ రోజు నా ఆరోగ్యం కొంచెం బాలేదు. అయినప్పటికీ మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. గత సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో నేను పోషించిన 'మీను' పాత్రను మీరు ఎంతగానో ప్రేమించారు. అలాగే ఈ సంక్రాంతికి మీరు 'చారులత' పాత్రపై ప్రేమను కురిపిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
కుటుంబం లాంటిది
"మీ అందరి లాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సితార సంస్థ నాకు కుటుంబం లాంటిది. ఈ బ్యానర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు మారి గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడిగా పరిచయమవుతున్న ఆయన.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను" అని మీనాక్షి చౌదరి కోరారు.
నవీన్ నుంచి ఎంతో నేర్చుకున్నా
"డీఓపీ యవరాజు గారి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్. రైటర్, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి గారికి థాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. నవీన్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనలో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. సినిమా పట్ల నవీన్ గారికి ఉన్న తపన, సినిమా కోసం ఆయన పడే కష్టం అసాధారణమైనది" అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
నవ్వుకుంటూ సంక్రాంతి జరుపుకోండి
"మిక్కీ జె మేయర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. జనవరి 14న విడుదలవుతున్న మా 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకుంటూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి" అని తన స్పీచ్ ముగించారు బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి.