Sign in

మా సినిమాను తొక్కేయొద్దనే కోరుతున్నాం.. ఇక ఆ మూవీ సీక్వెల్ లేనట్లే: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

ప్రొడ్యూసర్ నాగవంశీ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సంక్రాంతికి అనగనగా ఒక రాజు మూవీతో వస్తున్న అతడు.. తమ సినిమాను తొక్కేయొద్దు అని మీడియాను కోరుతున్నానని చెప్పడం విశేషం. అంతేకాదు కింగ్డమ్ మూవీ సీక్వెల్ లేనట్లే అని స్పష్టం చేశాడు.

Published on: Jan 2, 2026, 16:29:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక కామెంట్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐడిల్‌బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమ సినిమాను తొక్కేయొద్దు అంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి నవీన్ పోలిశెట్టితో కలిసి అతడు తీసిన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు అతడు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

మా సినిమాను తొక్కేయొద్దనే కోరుతున్నాం.. ఇక ఆ మూవీ సీక్వెల్ లేనట్లే: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్
మా సినిమాను తొక్కేయొద్దనే కోరుతున్నాం.. ఇక ఆ మూవీ సీక్వెల్ లేనట్లే: ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్స్

మా సినిమాను తొక్కేయొద్దనే అడుగుతున్నాం..

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడైన నాగవంశీ తాజాగా తన నెక్ట్స్ మూవీ అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో భాగంగా ఐడిల్‌బ్రెయిన్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మూవీ ఫెయిలవడంలో ఎవరిది తప్పు అని యాంకర్ అడిగినప్పుడు అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“చాలా వరకు తప్పు మా దగ్గరే అంటే ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే జరుగుతాయి. కానీ కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమాలు ఉంటాయి కదా.. వాటిని తొక్కేయొద్దు అని మీడియాను అడుగుతున్నాం అంతే.. రెండు వీకెండ్స్ ఆరు రోజులు ఎడ్జ్ ఉంటే బయర్స్ కోణంలో సినిమాకు 70, 80 శాతం వరకు వెళ్లిపోతాం. ఆ ఎడ్జ్ ఇవ్వమనే అడుగుతున్నాం. సినిమా తప్పు వరకు చూస్తే అది మా దగ్గరే జరుగుతుంది. ఇంకెవరూ సినిమాను చంపలేరు. అవన్నీ తప్పు మాటలు. సినిమా హిట్ కావడం ఆడియెన్స్ చేతుల్లోనే ఉంది. కానీ కాస్త ఆడే సినిమాలను మాత్రం పుష్ చేయడం.. తొక్కేయొద్దు అని మాత్రమే అడుగుతున్నాం” అని నాగవంశీ అన్నాడు.

కింగ్డమ్ సీక్వెల్ లేనట్లే

ఇక విజయ్ దేవరకొండతో కలిసి కింగ్డమ్ మూవీ తీసి నాగవంశీ దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీకి ఇక సీక్వెల్ లేనట్లే అని కన్ఫమ్ చేశాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి మరో సినిమా చేస్తున్నాడని, ఆ తర్వాత అతనితో తాను ఇంకో మూవీ చేస్తానని స్పష్టం చేశాడు. కింగ్డమ్ ఎక్కడ మిస్ ఫైర్ అయిందో అర్థం కావడం లేదని చెప్పాడు.

ఇక ఇప్పుడు వస్తున్న అనగనగా ఒక రాజు మూవీ కచ్చితంగా నవ్విస్తుందని మరోసారి నాగవంశీ తేల్చి చెప్పాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More