ఆ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని ఆలోచిస్తా.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్.. అదే పెద్ద విజయమన్న నాగవంశీ
హీరో నవీన్ పోలిశెట్టి నటించి హిట్ కొట్టిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇటీవల సినిమా యూనిట్‌కు జ్ఞాపికలు అందజేశారు. ఈ ఈవెంట్‌లో హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఏడాది 2026 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సినిమాల్లో అనగనగా ఒక రాజు మూవీ ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఇటీవల మూవీ యూనిట్‌కు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అరుదైన సంక్రాంతి
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాజు గారి పెళ్లి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది అరుదైన సంక్రాంతి" అని అన్నాడు.
ఇంతటి పోటీలో కూడా
"పెద్ద సినిమాలతో పాటు విడుదలై, మీ సినిమా నిలబడుతుందా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. ఇంతటి పోటీలో కూడా మా సినిమా నిలబడి, ఘన విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకులే. మీకు ఎంత కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.
మీరు లేకపోతే నేను లేను
"మా సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, మా నవీన్ సినిమా వస్తుందని నమ్మి.. థియేటర్‌కి వచ్చి సినిమా చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే నవీన్ పొలిశెట్టి అనే వ్యక్తి లేడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ వేదిక మీద నిల్చొని లాభాలు పొందామని చెప్పడం సంతోషాన్ని కలిగించింది" అని హీరో నవీన్ పేర్కొన్నాడు.
ముగ్గురికి నష్టం జరగకూడదు
"నేను కథ విన్నప్పుడు ముగ్గురు గురించి కచ్చితంగా ఆలోచిస్తాను. మొదటగా మా నిర్మాతకు నష్టం జరగకూడదు అనుకుంటాను. రెండు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకూడదు. మూడోది కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు. ఈ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని నేను ప్రతి కథకి ఆలోచిస్తాను. ఏడాదికి రెండు, మూడు సినిమాలు కూడా చేయవచ్చు. కానీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకుంటాను" అని నవీన్ వెల్లడించాడు.
మరింత ప్రత్యేకంగా మారింది
ఇదే ఈవెంట్‌లో కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "నాకు ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారింది. ప్రేక్షకులు మాపై ప్రేమను ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు" అన్నారు.
లాభాలు వచ్చాయనడమే పెద్ద విజయం
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "డిస్ట్రిబ్యూటర్లు మాకు లాభాలు వచ్చాయని చెప్పడమే.. నిర్మాతకు పెద్ద విజయం. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మంచి లాభాలను చూశామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


