Avika Gor: దేశం వదిలిపెట్టిన అగ్లీ బ్యూటీ- బ్యాంకాక్‌కు మకాం మార్చిన అవికా గోర్- కారణం చెప్పిన చిన్నారి పెళ్లికూతురు!

Avika Gor Bangkok Move And Reason: టాలీవుడ్ హీరోయిన్, బుల్లితెర చిన్నారి పెళ్లికూతురు, అగ్లీ బ్యూటీ అవికా గోర్ దేశం వదిలిపెట్టి వెళ్లిపోయింది. ముంబై నుంచి బ్యాంకాక్‌కు తన మకాంను మార్చేసింది అవికా గోర్. ఈ విషయాన్ని తానే చెబుతూ కొత్త ఇంటికోసం వస్తువులు కొనడం చాలా ఉత్సాహంగా ఉందని తెలిపింది.

Published on: May 9, 2026, 17:51:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heroine Avika Gor Bangkok Move: 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్న యంగ్ హీరోయిన్ ఇప్పుడు తన నివాసాన్ని ముంబై నుంచి బ్యాంకాక్‌కు మార్చారు.

దేశం వదిలిపెట్టిన అగ్లీ బ్యూటీ- బ్యాంకాక్‌కు మకాం మార్చిన అవికా గోర్- కారణం చెప్పిన చిన్నారి పెళ్లికూతురు!
దేశం వదిలిపెట్టిన అగ్లీ బ్యూటీ- బ్యాంకాక్‌కు మకాం మార్చిన అవికా గోర్- కారణం చెప్పిన చిన్నారి పెళ్లికూతురు!

బ్యాంకాక్‌కు మకాం

తాను బ్యాంకాక్‌కు మకాం మార్చిన విషయాన్ని అవికా గోర్ స్వయంగా ధృవీకరించారు. ఇది కేవలం ఒక ఊహించని మార్పు మాత్రమే కాదని, జీవితంలో సహజంగా జరిగిన ఒక పురోగతి అని అగ్లీ మూవీ బ్యూటీ అవికా గోర్ అభివర్ణించారు. బ్యాంకాక్‌లో ఇప్పటికే ఒక సొంత ఇల్లు కొనుగోలు చేశామని, తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నానని అవికా తెలిపారు.

భర్త ఎదుగుదల కోసమే ఈ నిర్ణయం

బ్యాంకాక్‌కు మారే నిర్ణయం వెనుక గల ప్రధాన కారణాన్ని అవికా గోర్ వివరిస్తూ.. "మిలింద్ చేసే పనికి బ్యాంకాక్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడకు వెళ్లడం మంచిదని భావించాం. మేము ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఒకరి ఎదుగుదలకు మరొకరం ఎప్పుడూ సహకరించుకున్నాం. షూటింగ్స్ కోసం నేను నెలల తరబడి దూరంగా ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వృత్తి పరమైన ఎదుగుదలకు నేను అడ్డు కాకూడదని భావించాను" అని పేర్కొన్నారు.

భారత్‌లో కెరీర్ కొనసాగుతుందా?

దేశం వదిలి వెళ్లడం వల్ల అవకాశాలు తగ్గుతాయని అవికా గోర్ భయపడటం లేదు. ముంబైలో ఉన్నప్పుడు కూడా అవికా గోర్ ఎక్కువగా హైదరాబాద్, రాజమండ్రి లేదా విశాఖపట్నంలోనే షూటింగ్స్‌లో గడిపేవారు.

"నాతో పని చేయాలనుకునే వారు నా షెడ్యూల్ ప్రకారం ముందుకు వస్తారు. నా కెరీర్‌ను నిలబెట్టిన నా వృత్తిపరమైన బాధ్యతలే నాకు ఎప్పుడూ ప్రాధాన్యత. ప్రస్తుతం నేను ఒక నెల రోజులుగా అక్కడ ఉంటున్నా, పని నిమిత్తం ఎక్కువగా హైదరాబాద్ లేదా ముంబైలోనే తిరుగుతున్నాను. పరిశ్రమలోని వారు కూడా నా నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు" అని అవికా గోర్ ధీమా వ్యక్తం చేశారు.

కొత్త జీవితం.. కొత్త బాధ్యతలు

ప్రస్తుతం 28 ఏళ్ల అవికా గోర్ తన కొత్త ఇంటిని తానే స్వయంగా డిజైన్ చేసుకోవడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సాధారణంగా తల్లిదండ్రులు లేదా అత్తమామలు ఏర్పాటు చేసిన ఇళ్లలో ఉంటామని, కానీ ఇప్పుడు ప్రతి చిన్న వస్తువును తానే స్వయంగా ఎంచుకోవడం ఒక కొత్త అనుభూతిని ఇస్తోందని అవికా గోర్ సంబరపడిపోతున్నారు.

అయితే, తన మనసు మాత్రం భారత్‌లోనే ఉంటుందని అవికా గోర్ భావోద్వేగానికి లోనయ్యారు. "మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతా అక్కడే ఉన్నారు. కాబట్టి నా మనసు ఎప్పుడూ భారత్‌తోనే ఉంటుంది. త్వరలో 'ఖత్రోన్ కే ఖిలాడీ' షూటింగ్ కోసం బయలుదేరుతున్నాను, అలాగే నా సౌత్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన దశలో ఉన్నాను" అని అవికా గోర్ ముగించారు.

అవికా గోర్ అగ్లీ రిలీజ్

అవికా గోర్ చెప్పిన సౌత్ సినిమా అగ్లీ. సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు హీరోగా నటించిన బోల్డ్ డార్క్ ఫ్యామిలీ డ్రామా చిత్రమే అగ్లీ. మే 22న ఈ అగ్లీ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More