నా ప్రెగ్నెన్సీ వార్తలు నిజం కాదు- కానీ, ఓ సర్‌ప్రైజ్ ఉంది: చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ - మరింత పెరిగిన సస్పెన్స్!

చిన్నారి పెళ్లికూతురు నటి, హీరోయిన్ అవికా గోర్ ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్లపై అవికా గోర్ తాజాగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, కానీ, త్వరలోనే ఒక సర్‌ప్రైజ్ ఇస్తామని హింట్ ఇచ్చింది బ్యూటిపుల్ అవికా గోర్.

Published on: Jan 9, 2026, 14:24:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెలివిజన్ రంగంలో ‘చిన్నారి పెళ్లి కూతురు’గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ముద్దుగుమ్మ అవికా గోర్. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో వార్తల్లో నిలిచింది అవికా గోర్.

నా ప్రెగ్నెన్సీ వార్తలు నిజం కాదు- కానీ, ఓ సర్‌ప్రైజ్ ఉంది: చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ - మరింత పెరిగిన సస్పెన్స్!
నా ప్రెగ్నెన్సీ వార్తలు నిజం కాదు- కానీ, ఓ సర్‌ప్రైజ్ ఉంది: చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ - మరింత పెరిగిన సస్పెన్స్!

2025లో బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది హీరోయిన్ అవికా గోర్. పతి పత్నీ ఔర్ పంగా అనే టీవీ రియాలిటీ షో వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, అవికా గోర్ త్వరలోనే తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టిన అవికా

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఘాటుగా స్పందించారు. "నేను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. అయితే, మా జీవితంలో ఒక కొత్త విషయం జరగబోతోంది. ఆ సర్‌ప్రైజ్ ఏంటనేది త్వరలోనే అందరికీ చెబుతాము" అని అవికా గోర్ క్లారిటీ ఇచ్చి చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవికా గోర్ అభిమానుల్లో సస్పెన్స్ మరింతగా పెరిగింది.

అసలు ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయి?

ఇదిలా ఉంటే, అవికా గోర్, మిలింద్ కలిసి ఇటీవల చేసిన ఒక వ్లాగ్ (Vlog) ఈ ప్రెగ్నెన్సీ వార్తలకు దారితీసింది. 2026లో తమ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని అవికా అందులో పేర్కొన్నారు.

దీనికి మిలింద్ స్పందిస్తూ.. "మేము ఎప్పుడూ కలగనని, ప్లాన్ చేయని ఒక అద్భుతమైన మార్పు ఇది. కొంచెం నెర్వస్‌గా ఉన్నా, ఇది చాలా పెద్ద విషయం" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్స్ చూసిన నెటిజన్స్ అవికా గోర్ తల్లి కాబోతోందని, అందుకే ఈ జంట అంత ఎగ్జైటింగ్‌గా ఉందంటూ కామెంట్లతో హోరెత్తించారు.

రియాలిటీ షోలో ఘనంగా పెళ్లి

ఇక అవికా గోర్, మిలింద్ చంద్వానీ 2020లో హైదరాబాద్‌లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, 2025 సెప్టెంబర్ 30న ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే రియాలిటీ షో వేదికగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలకు హినా ఖాన్, రుబినా దిలైక్, ఫరా ఖాన్ వంటి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

కాగా, ప్రస్తుతం అవికా గోర్ తన కెరీర్ పట్ల కూడా దృష్టి సారిస్తూనే, మరోవైపు తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి అవికా గోర్ చెప్పబోయే ఆ ‘గుడ్ న్యూస్’ ఏంటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More