సమంత తెలుగు మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన బాయ్‌ఫ్రెండ్.. ఎక్కడికెళ్లినా వెంటే..

సమంత కొత్త తెలుగు మూవీ షూటింగ్ మొదలైంది. ఖుషీ తర్వాత ఆమె నటిస్తున్న పూర్తి స్థాయి తెలుగు సినిమా ఇదే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఆమె బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న రాజ్ నిడిమోరు కనిపించడం, అతడే క్లాప్ ఇవ్వడం విశేషం.

Published on: Oct 27, 2025, 19:21:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమంత రూత్ ప్రభు రెండేళ్ల తర్వాత మరోసారి ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా చేస్తోంది. ఈ మూవీ పేరు మా ఇంటి బంగారం. ఈ మూవీ షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో డైరెక్టర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

సమంత తెలుగు మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన బాయ్‌ఫ్రెండ్.. ఎక్కడికెళ్లినా వెంటే..
సమంత తెలుగు మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన బాయ్‌ఫ్రెండ్.. ఎక్కడికెళ్లినా వెంటే..

సమంత కొత్త సినిమా

సమంత నటించిన ఖుషీ మూవీ 2023లో రిలీజైంది. ఆ తర్వాత మధ్య తానే నిర్మించిన శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన ఆమె.. రెండేళ్ల తర్వాత మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తిరిగొస్తోంది. ఈ సినిమాను కూడా సమంతకే చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం.

ఈ సినిమా షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. “అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో మా ఇంటి బంగారం ముహూర్తపు షాట్ తో మా ప్రయాణం మొదలైంది. మేము ఏం క్రియేట్ చేస్తున్నామో మీతో పంచుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నాను. ఈ స్పెషల్ మూవీని ప్రారంభిస్తున్న వేళ మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

బేబీ మూవీ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డితో సమంత మరోసారి చేతులు కలిపింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ఇప్పుడు మా ఇంటి బంగారం వస్తోంది. చాలా రోజుల కిందటే ఈ సినిమా గురించి సామ్ వెల్లడించింది. మొత్తానికి ఇప్పుడు ముహూర్తపు షాట్ తో కొత్త జర్నీని సమంత ప్రారంభించింది.

సమంతతోనే రాజ్ నిడిమోరు

అయితే ఈమధ్య సమంత ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే ఉంటున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి కూడా వచ్చాడు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. క్లాప్ కూడా ఇవ్వడం విశేషం. ఈ మధ్యే సమంత కూడా రాజ్ ఫ్యామిలీతోనే దీపావళి సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు రాజ్ తో తాను కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉంది.

దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఇక కన్ఫమ్ అయినట్లే.. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సమంత ఈ మా ఇంటి బంగారం సినిమాతోపాటు అటు రాజ్ తోపాటు డీకే డైరెక్ట్ చేస్తున్న రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతోనే ఆమె గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2, సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ లు చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More