Kirti Kulhari: 8 ఏళ్లలో కేవలం 3 మాటలే- కట్ చేస్తే ఓటీటీ బోల్డ్ సిరీస్ నటీనటుల ప్రేమాయణం- కీర్తి కుల్హారిపై లవర్ పోస్ట్

Kirti Kulhari Boyfriend Rajeev Siddhartha Birthday Post: ఓటీటీ బోల్డ్ సిరీస్ బ్యూటీ కీర్తి కుల్హారీ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రియుడు, నటుడు రాజీవ్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ సిరీస్ ద్వారా పరిచయమైన ఈ జంట చాలా కాలం తర్వాత ఎలా ప్రేమలో పడ్డారో వివరించారు.

Published on: May 31, 2026, 22:41:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kirti Kulhari Boyfriend Rajeev Siddhartha Birthday Post: సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. కొందరు మొదటి చూపులోనే ప్రేమలో పడితే, మరికొందరు ఎన్నో ఏళ్ల పరిచయం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిత భాగస్వాములుగా మారుతుంటారు.

8 ఏళ్లలో కేవలం 3 మాటలే- కట్ చేస్తే ఓటీటీ బోల్డ్ సిరీస్ నటీనటుల ప్రేమాయణం- కీర్తి కుల్హారిపై లవర్ పోస్ట్
8 ఏళ్లలో కేవలం 3 మాటలే- కట్ చేస్తే ఓటీటీ బోల్డ్ సిరీస్ నటీనటుల ప్రేమాయణం- కీర్తి కుల్హారిపై లవర్ పోస్ట్

ఓటీటీ బోల్డ్ సిరీస్ బ్యూటీ

సరిగ్గా ఇలాంటి ఒక విలక్షణమైన, అందమైన ప్రేమకథతో ఓటీటీ బోల్డ్ సిరీస్ బ్యూటీ కీర్తి కుల్హారీ, బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మే 31న కీర్తి కుల్హారీ పుట్టినరోజును పురస్కరించుకుని రాజీవ్ పెట్టిన ఎమోషనల్ బర్త్‌డే పోస్ట్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.

అమితాబ్ బచ్చన్, తాప్సీలతో కలిసి నటించిన ‘పింక్’ సినిమాతో పాటు ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘మిషన్ మంగళ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కీర్తి కుల్హారీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఓటీటీ సిరీస్ ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’లో లాయర్ అంజనా మీనన్‌గా ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఈ ఓటీటీ బోల్డ్ సిరీస్ సెట్‌‌లోనే కీర్తి, రాజీవ్‌ల పరిచయం ఏర్పడింది.

ఎనిమిదేళ్ల పరిచయం.. కేవలం మూడు మాటలు!

కీర్తి బర్త్‌డే సందర్భంగా రాజీవ్ సిద్ధార్థ్ తమ ఇద్దరి క్యూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఒక లవ్లీ మెసేజ్ రాసుకొచ్చారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అందాల రాశి. ఒకే సిరీస్‌లో ఎనిమిదేళ్లు కలిసి పనిచేసినా, ఆ కాలంలో మనమిద్దరం మాట్లాడుకున్నది కేవలం మూడు వాక్యాల కంటే తక్కువే. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ విషయం గురించైనా గంటల తరబడి మాట్లాడుకోగలుగుతున్నాం. మన ఈ జర్నీ నిజంగా ఎంతో అద్భుతంగా సాగుతోంది బర్త్‌డే గర్ల్" అని రాజీవ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

"నువ్వు జీవితంలో మరింత ఎదగాలని, నీ హృదయం ఎప్పుడూ ఆశలతో, ఉత్సాహంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ" అని రాజీవ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని కీర్తి కుల్హారీ ఈ ఏడాది ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించారు.

జనవరిలోనే లవ్ అఫీషియల్!

జనవరి 2026 కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కీర్తి ఒక బ్యూటిఫుల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేశారు. అందులో వీరు కలిసి ప్రయాణాలు చేసిన జ్ఞాపకాలు, కారు సెల్ఫీలు, రాజీవ్ తలపై కీర్తి ముద్దు పెడుతున్న ఫొటోలు ఉన్నాయి. "ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం" అంటూ హార్ట్ ఎమోజీతో కీర్తి పెట్టిన ఆ పోస్ట్ అప్పట్లోనే హాట్ టాపిక్‌గా మారింది.

ఒకే సిరీస్.. వేర్వేరు ప్రపంచాలు

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ వెబ్ సిరీస్ చూసిన వారికి వీరిద్దరి కాంబినేషన్ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ముంబై నగరంలో నివసించే నలుగురు స్వతంత్ర మహిళల కథాంశంతో తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో కీర్తి కుల్హారీ ఒక సింగిల్ మదర్, సక్సెస్‌ఫుల్ లాయర్ పాత్రను పోషించారు.

రాజీవ్ సిద్ధార్థ్ ఇందులో మరో నటి మాన్వి గారూ (సిద్ధి పటేల్) ట్రాక్‌లో ‘మిహిర్’ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. స్క్రీన్ స్పేస్ పరంగా వీరిద్దరికీ పెద్దగా కాంబినేషన్ సీన్లు లేకపోవడంతో, షూటింగ్ సెట్స్‌లో కూడా చాలా కాలం పాటు కేవలం సహోద్యోగులుగానే దూరంగా ఉండిపోయారు. కాలక్రమేణా వీరి మధ్య స్నేహం పెరిగి, అది కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది.

కెరీర్ ముచ్చట్లు

కెరీర్ పరంగా చూస్తే, కీర్తి కుల్హారీ ఇటీవల 'బ్యాడాస్ రవికుమార్', 'హిసాబ్ బరాబర్' వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజీవ్ సిద్ధార్థ్ కూడా ‘ది బ్రోకెన్ న్యూస్’, ‘హండ్రెడ్’ వంటి హిట్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై దూసుకుపోతున్నారు.

కెరీర్‌లోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ ఈ లవ్ బర్డ్స్ ఇలాగే సంతోషంగా సాగిపోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More