Alia Bhatt: గుండెలు పగలగొట్టడం నుంచి ఎముకలు విరగ్గొట్టడం వరకు- అలియా భట్‌పై షారుఖ్ ఖాన్- కత్రినా కైఫ్ రియాక్షన్ ఏంటంటే?
Katrina Kaif Shah Rukh Khan Praised Alia Bhatt Alpha: గుండెలు పగలగొట్టడం నుంచి ఎముకలు విరగ్గొట్టడం వరకు అంటూ అలియా భట్‌పై షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు. ఆల్ఫా మూవీ టీజర్‌కు సంబంధించి షారుఖ్ అలా కామెంట్ చేయగా కత్రినా కైఫ్ కూడా స్పందించింది. బాబీ డియోల్ విలన్‌గానే బాగుంటాడని షారుఖ్ అన్నాడు.
Katrina Kaif Shah Rukh Khan Praised Alia Bhatt Alpha: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe) పరిధి మరింత విస్తరిస్తోంది. సల్మాన్ ఖాన్ 'టైగర్' సిరీస్, హృతిక్ రోషన్ 'వార్', షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన ఈ యూనివర్స్, ఇప్పుడు పూర్తిగా మహిళా శక్తులతో కూడిన సరికొత్త యాక్షన్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ సైతం
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం 'వార్ 2' సినిమాతో ఈ స్పై యూనివర్స్‌లోకి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్పై యూనివర్స్‌పై తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ యూనివర్స్ నుంచి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఆల్ఫా' (Alpha) మూవీ తెరకెక్కింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఆల్ఫా మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 10) నాడు విడుదల చేశారు. ఆల్ఫా టీజర్‌లో అలియా భట్ యాక్షన్ స్టంట్స్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిదా అవుతున్నాయి.
యాక్షన్ మోడ్‌లో అలియా..
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇప్పటికే 'జోయా' పాత్రతో యాక్షన్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 'ఆల్ఫా' టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ అలియాపై ప్రశంసల వర్షం కురిపించారు కత్రీినా కైఫ్.
కత్రినా ఏమన్నారంటే?
"మై డియరెస్ట్ అలియా భట్, శార్వరీ.. టీజర్ నిప్పులు చెరుగుతోంది. ఆల్ఫా సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. ఫుల్ యాక్షన్ మోడ్.. ఇక మొదలుపెట్టండి" అని కత్రినా కైఫ్ రాసుకొచ్చారు.
కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన 'ఏక్ థా టైగర్' (2012) సినిమాతోనే ఈ స్పై యూనివర్స్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 'టైగర్ జిందా హై', 'టైగర్ 3' చిత్రాలతో ఈ ఫ్రాంచైజీని కత్రినా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే యూనివర్స్‌లోకి వస్తున్న మరో క్రేజీ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను కత్రినా మనస్ఫూర్తిగా స్వాగతించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
'గుండెలు పగలగొట్టడం నుంచి ఎముకలు విరగ్గొట్టడం వరకు..' షారుఖ్ ట్వీట్
కత్రినాతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా అలియా భట్‌ను సరికొత్తగా అభినందించారు. "వెల్ డన్ ఆలియా.. గతంలో సినిమాల్లో గుండెలు పగలగొట్టేదానివి, ఇప్పుడు ఎముకలు విరగ్గొడుతున్నావు. నీ నైపుణ్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 'ఆల్ఫా' చిత్రం అందరి హృదయాలను గెలుచుకోవాలి. సీక్వెల్ కోసం కొంతమంది విలన్లను మిగల్చడం మర్చిపోకు. గో గెట్ దెమ్ సిగ్మా గర్ల్! లార్డ్ బాబీ.. నువ్వు విలన్‌గా ఉన్నప్పుడే చాలా బాగుంటావు" అంటూ షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.
చిన్న వయసు నుంచే
ఈ చిత్రంలో విలక్షణ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌లో చూపించిన దాని ప్రకారం, చిన్న వయసు నుంచే ఆలియా క్యారెక్టర్‌ను ఒక పవర్‌ఫుల్ గూఢచారిగా మార్చేందుకు బాబీ డియోల్ శిక్షణ ఇస్తాడు.
ఆమె 18వ పుట్టినరోజున ఒక లగ్జరీ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి, మొదటి మిషన్‌గా ఒకరిని అంతమొందించే బాధ్యతను అప్పగిస్తాడు. ఆ తర్వాత ఆలియా శత్రువుల వేట మొదలుపెడుతుంది. అయితే ఈ టీజర్‌లో మరో ముఖ్య హీరోయిన్ శార్వరీ కనిపించకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పాత ప్రేమ.. సరికొత్త స్నేహం.. నెట్టింట ఆసక్తికర చర్చ
కత్రినా కైఫ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, వీరిద్దరి పాత వ్యక్తిగత జీవితాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా కైఫ్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ సమయంలో కత్రినా, అలియా భట్ మంచి స్నేహితులుగా ఉండేవారు.
2016లో రణ్‌బీర్, కత్రినా విడిపోయిన తర్వాత, రణ్‌బీర్ ఆలియాతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకోగా, వీరికి రాహా అనే కుమార్తె ఉంది. మరోవైపు కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకుని, ప్రస్తుతం విహాన్ కౌశల్ అనే కుమారుడికి జన్మనిచ్చారు.

ప్రొఫెషనల్‌గా సపోర్ట్
గతాన్ని పక్కన పెట్టి, ప్రొఫెషనల్‌గా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కత్రినా, ఆలియా చూపిస్తున్న ఈ పరిణతిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆల్ఫా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


