Dhurandhar YRF: 6 సినిమాల వైఆర్ఎఫ్ స్పై సిరీస్‌ను బీట్ చేసే దిశగా ధురంధర్ ఫ్రాంచైజీ- 3 వేల కోట్లు అవుట్-ఇంకెంత రావాలంటే?
Dhurandhar Vs YRF Spy Universe Box Office: ఆదిత్య ధర్ సృష్టించిన 'ధురంధర్' ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండు సినిమాలతోనే రూ. 3000 కోట్ల వసూళ్లను రాబట్టి, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్, బాహుబలి చిత్రాల రికార్డులను మట్టికరిపిస్తూ అగ్రస్థానానికి దూసుకెళ్తోంది.
Dhurandhar Vs YRF Spy Universe Box Office Collection: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. అదే 'ధురంధర్'. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

3000 కోట్లకు ధురంధర్ సిరీస్
కేవలం మూడు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు భాగాలు బాలీవుడ్ వసూళ్ల లెక్కలను పూర్తిగా మార్చేశాయి. ఈ వారం 'ధురంధర్: ది రివెంజ్' వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్ల మార్కును దాటడంతో, ధురంధర్ ఫ్రాంచైజీ మొత్తం వసూళ్లు రూ. 3000 కోట్లకు చేరుకున్నాయి.
భారత సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఫ్రాంచైజీగా ధురంధర్ నిలిచింది. వచ్చే వారం నాటికి ఇది 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్'ను కూడా దాటేసి నంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
కళ్లు చెదిరే వసూళ్లు.. సరికొత్త రికార్డులు!
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దేశీయంగా రూ. 841 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో 33 మిలియన్ డాలర్లను రాబట్టి మొత్తంగా రూ. 1300 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. సుమారు 14 వారాల పాటు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా రణ్‌వీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఇక మార్చిలో విడుదలైన సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' అయితే బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే రోజు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించడమే కాకుండా, మొదటి వీకెండ్‌లోనే మూడుసార్లు ఈ ఫీట్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఏప్రిల్ 16 నాటికి ఈ ధురంధర్ 2 భారత్‌లో రూ. 1025 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1720 కోట్లకు పైగా వసూలు చేసింది. నిర్మాతల లెక్కల ప్రకారం ఈ వసూళ్లు రూ. 1760 కోట్లు దాటినట్లు తెలుస్తోంది.
బాహుబలి, పుష్ప రికార్డులు కనుమరుగు..
ఇంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' (రూ. 2400 కోట్లు) అగ్రస్థానంలో ఉండేది. అల్లు అర్జున్ 'పుష్ప' సిరీస్ రూ. 2100 కోట్లతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బాహుబలిని దాటలేకపోయింది.
కానీ 'ధురంధర్' సీక్వెల్ విడుదలైన వారం రోజుల్లోనే ఈ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఆరు సినిమాలతో ఉన్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సాధించిన రూ. 3100 కోట్ల రికార్డును, ధురంధర్ కేవలం రెండు సినిమాలతోనే అధిగమించడానికి సిద్ధమైంది. ధురంధర్ ఫ్రాంచైజీకి ఇప్పటికే 3 వేల కోట్లు రాగా ఇంకో వంద కోట్లు వస్తే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌ను బీట్ చేసినట్లే అవుతుంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు చెక్..
ఖాన్ త్రయం, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలున్న 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (టైగర్, వార్, పఠాన్) ప్రస్తుతం ధురంధర్ ధాటికి వెనుకబడిపోతోంది. 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ఆలియా భట్ 'ఆల్ఫా' సినిమా ఆలస్యం కావడం వైఆర్ఎఫ్ యూనివర్స్‌కు మైనస్‌గా మారింది. మరోవైపు 'టైగర్ వర్సెస్ పఠాన్' ప్రాజెక్ట్ కూడా అటకెక్కే సూచనలు కనిపిస్తుండటంతో, రానున్న రోజుల్లో 'ధురంధర్' హవానే నడవనుంది.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే భారత గూఢచారిగా రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాలను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఉండటం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


