370 Rs: 370 ఖర్చు పెడితే అమ్మాయి శరీరంపై హక్కు వచ్చేస్తుందా? ప్రశ్నించిన తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్- కమెడియన్ కృతజ్ఞతలు!
Ayesha Khan On ₹370 Biryani Controversy: ఒక డేట్‌లో రూ. 370 బిర్యానీ తినిపించి, అమ్మాయి శరీరంపై హక్కు కోరిన యువకుడి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ ఘాటుగా స్పందిస్తూ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Telugu Heroine Ayesha Khan On ₹370 Biryani Controversy: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు నవ్వుల కోసం చేసే కొన్ని పనులు ఒక్కోసారి ఎంతటి తీవ్ర వివాదాలకు దారితీస్తాయో చెప్పడానికి తాజా '370 రూపాయల బిర్యానీ వివాదం' ఒక ఉదాహరణ. గురుగ్రావ్‌లో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

అనాగరిక ఆలోచనలు
మహిళల పట్ల మగవారిలో ఉన్న అనాగరిక ఆలోచనలను, 'సమ్మతి' (Consent) అనే ప్రాథమిక సూత్రాన్ని కించపరిచేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే, సదరు కమెడియన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది.
అసలు ఈ రూ. 370 బిర్యానీ వివాదం ఏంటి?
ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే గురుగ్రామ్‌లో ఒక షో నిర్వహించారు. స్టాండప్ కామెడీలో భాగంగా స్టేజ్ మీదున్న కమెడియన్లు ఆడియన్స్‌తో మాట్లాడటం (Crowd Work) సాధారణం. ఈ క్రమంలో హిమాన్షు జంగ్రా (23) అనే యువకుడు తాను ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లినప్పటి అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ అమ్మాయికి రూ. 370 పెట్టి బిర్యానీ కొనిపించానని, అందుకు బదులుగా ఆమె నుంచి శారీరక సాన్నిహిత్యాన్ని ఆశించానని ఆ యువకుడు చెప్పాడు.
పీక్ గుర్‌గావ్ కంటెంట్
"నేను రూ. 370 ఖర్చు పెట్టాను, కాబట్టి ఆ డబ్బును వసూలు చేసుకోవాలి కదా" అని ఆ యువకుడు అన్నాడు. ఈ అభ్యంతరకరమైన కామెంట్‌కు అక్కడ కూర్చున్న చాలా మంది పురుషులు పెద్దగా నవ్వారు. వేదికపై ఉన్న కమెడియన్ ప్రణిత్ మోరే కూడా ఆ మాటలకు విపరీతంగా నవ్వుతూ, దానిని సమర్థించాడు.
అంతటితో ఆగకుండా, ఈ సీన్‌ను "పీక్ గుర్‌గావ్ కంటెంట్" అంటూ సోషల్ మీడియాలో రీల్ రూపంలో పోస్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, శరీరాన్ని రూ. 370 బిర్యానీతో పోల్చడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
"చూడటానికే భయంగా ఉంది".. ఆయేషా ఖాన్ ఆగ్రహం
ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వివాదంపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. హిందీ బిగ్‌బాస్ ఫేమ్, తెలుగు హీరోయిన్, ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
"ఆ హాల్‌లో ఉన్న ప్రతి మగాడు ఆ దారుణమైన కామెంట్‌కు నవ్వుతున్న తీరు చూస్తుంటేనే భయం వేస్తోంది. హోస్ట్ అంతలా నవ్వడం, ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టే ముందు కనీసం ఆలోచించకపోవడం మరీ ఘోరం. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి విషయాలపై మనం తగినంతగా స్పందించడం లేదు" అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటు వైపు వెళ్తున్నాం?
"నువ్వు ఒక డేట్‌కు వెళ్లి కేవలం రూ. 370 ఖర్చు పెడితే, అవతలి అమ్మాయి శరీరంపై నీకు హక్కు వచ్చేస్తుందా? మనం అసలు ఎటు వైపు వెళ్తున్నాం? జనాలు ఏమైపోతున్నారు?" అని ఆయేషా ఖాన్ సూటిగా ప్రశ్నించారు.
అకౌంట్ డిలీట్ చేసిన కమెడియన్
నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో ట్రోలింగ్ ఎదురవడంతో కమెడియన్ ప్రణిత్ మోరే ఎట్టకేలకు స్పందించారు. తన తప్పును ఒప్పుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత తన అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకున్నారు.
"ఇటీవలి షో క్లిప్‌పై వస్తున్న విమర్శలను నేను చూశాను. ఆ ప్రేక్షకుడు చేసిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ సమయంలో ఆ కామెంట్‌కు నవ్వి ఊరుకోకుండా నేను అతనిని గద్దించాల్సింది. అది నా వైపు నుంచి జరిగిన పెద్ద తప్పు" అని ప్రణిత్ మోరే పేర్కొన్నారు.

నా తప్పును ఎత్తిచూపిన వారికి కృతజ్ఞతలు
"నా తప్పును సున్నితంగా ఎత్తిచూపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ ఘటనకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నేను కూడా ఒక మనిషినే, జీవితంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను" అని ప్రణీత్ మోరే ముగించారు. కాగా 370 బిర్యానీ గురించి మాట్లాడిన యువకుడు హిమాన్షు జంగ్రా తన ఉద్యోగాన్ని కోల్పోవడం గమనార్హం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


