Kareena Kapoor: సెలబ్రిటీలైతే కొమ్ములుంటాాయా? ఎయిర్‌పోర్టులో కరీనా కపూర్ క్యూ పాటించకపోవడంతో నెటిజన్ల ట్రోలింగ్
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ విమానాశ్రయంలో క్యూ లైన్ నిబంధనలను అతిక్రమించి వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే ఈ 'బేబో'.. ఇప్పుడు ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విమానాశ్రయంలో సామాన్యుల పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలైతే కొమ్ములుంటాయా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందో చూడండి.

క్యూ లైన్ దాటి వెళ్లిన కరీనా
తాజాగా కరీనా కపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కరీనా పీచ్ కలర్ సూట్-సల్వార్ ధరించి, స్టైలిష్ గ్లాసెస్‌తో కనిపించింది. అయితే ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వద్ద ప్రయాణికులందరూ క్యూ లైన్‌లో వేచి చూస్తుండగా.. కరీనా మాత్రం ఆ లైన్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా గేటు వద్దకు వెళ్లింది. ఆమెతో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు చూపించగానే భద్రతా సిబ్బంది ఆమెను లోపలికి పంపించేశారు.
నెటిజన్ల ట్రోలింగ్
చాలా సేపటి నుంచి లైన్‌లో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రయాణికులను కాదని, సెలబ్రిటీలకు ఇలాంటి 'స్పెషల్ ట్రీట్‌మెంట్' ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "సెలబ్రిటీలకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక హక్కులు ఎవరు ఇచ్చారు? అక్కడ లైన్‌లో ఉన్న వాళ్లందరికీ విమానం అందుకోవాలనే ఆత్రుత ఉంటుంది కదా" అని ఒక యూజర్ ప్రశ్నించారు.
మరికొందరైతే ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ.. దేశంలో ఈ వీఐపీ సంస్కృతికి ఎప్పుడు చెక్ పడుతుందని నిలదీస్తున్నారు. సామాన్యులకు ఒక రూల్, సెలబ్రిటీలకు ఒక రూలా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
వరుస సినిమాలతో బిజీ
వివాదాలు పక్కన పెడితే, కరీనా కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దాయరా' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దీనితో పాటు ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో కూడా కరీనా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ఎయిర్‌పోర్ట్ వివాదంపై కరీనా కపూర్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు అందరికీ సమానమేనని ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


