చెక్ బౌన్స్ కేసులో మరో సెలబ్రిటీ.. మహేష్ బాబు హీరోయిన్ కు నాన్ బెయిలబుల్ వారెంట్.. అమీషా పటేల్ రియాక్షన్ ఇదే

బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో లొంగిపోవడం కలకలం రేపుతోంది. ఈ టైమ్ లోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్  కూడా చెక్ బౌన్స్ కేసు ఎదుర్కొంటోంది. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. దీనిపై అమీషా రియాక్షన్ వైరల్ గా మారింది. 

Published on: Feb 17, 2026, 09:00:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవన్ కల్యాణ్ సినిమా బద్రి, మహేష్ బాబు మూవీ నానిలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ గుర్తుందా? ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు లీగల్ కేసులో ఇరుక్కుంది. చెక్ బౌన్స్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఓ వైపు బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో లొంగిపోయిన నేపథ్యంలో అమీషా పటేల్ కేసు హాట్ టాపిక్ గా మారింది.

అమీషా పటేల్ (instagram)
అమీషా పటేల్ (instagram)

అమీషా పటేల్ చెక్ బైన్స్

2017 ఈవెంట్ కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో మొరాదాబాద్ కోర్టు తాజాగా అమీషా పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017 నవంబర్ 16న జరిగిన ఒక వెడ్డింగ్ ఈవెంట్లో డ్యాన్స్ పర్పార్మెన్స్ కోసం అమీషాతో డీల్ సెట్ చేసుకున్నారు. అందుకు ఆమె రూ.14.50 లక్షల అడ్వాన్స్ తీసుకుంది. కానీ ఈవెంట్ కు అటెండ్ కాలేదు. అడ్వాన్స్ తిరిగివ్వాలని అడిగితే అమీషా ఇచ్చిన చెక్ బౌన్స్ అయినట్లు తెలిసింది.

లీగల్ యాక్షన్

మొరాదాబాద్ కోర్టు తనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అమీషా పటేల్ రియాక్టయింది. అది పాత విషయమని, ఎప్పుడో సెటిల్ అయిపోయిందని ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అమీషా పటేల్.. ‘‘పవన్ వర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ తో మొరాదాబాద్‌ కోర్టు ప్రొసీడింగ్స్ గురించి మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. ఇది చాలా పాత విషయం. చాలా ఏళ్ల క్రితం ఈ విషయంలో పవన్ వర్మ ఒక సెటిల్మెంట్ డీడ్‌పై సంతకం చేసి, ఫుల్ అమౌంట్ తీసుకున్నాడు’’ అని అమీషా పటేల్ రాసుకొచ్చింది.

క్రిమినల్ చర్యలు

‘‘ఇప్పుడు అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. కోర్టును ఆశ్రయించాడు. తప్పుడు కారణాలతో పబ్లిసిటీ పొందాలని అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లను పట్టించుకోకుండా నా పనిపైనే నేను ఫోకస్ పెడతా. మోసం చేసిన ఈ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా నా లాయర్లు రంగంలోకి దిగారు’’ అని అమీషా పటేల్ పేర్కొంది.

అమీషా ఇన్ స్టా స్టోరీ
అమీషా ఇన్ స్టా స్టోరీ

కోర్టుకు రాలేదని

2017లో జరిగిన ఈవెంట్ కు సంబంధించి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసుపై మొరాదాబాద్ కోర్టు విచారణ కొనసాగిస్తోంది. అయితే కోర్టు చెప్పినప్పటికీ ఈ హీరోయిన్ సోమవారం (ఫిబ్రవరి 16) కోర్టుకు అటెంట్ కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన కోర్టు మార్చి 27న అమీషా అటెండ్ కావాలని ఆదేశించింది.

అంతకుముందు 2018లో అమీషా పటేల్ ఇచ్చిన ఓ చెక్ బౌన్స్ అయింది. ఈ కేసులో ఆమె 2023లో రాంచీ సివిల్ కోర్టు ముందు లొంగిపోయింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More