Jagapathi Babu SRK: జగపతి బాబుల నటించలేక బూతు తిట్టిన షారుఖ్ ఖాన్- ఆ బూతు మాటే అతిపెద్ద కాంప్లిమెంట్ అన్న జగ్గుభాయ్

Jagapathi Babu About Shah Rukh Khan Compliment: టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు మధ్య ఉన్న ఒక వింత పోలిక గురించి మీకు తెలుసా? ఒకప్పుడు కింగ్ ఖాన్‌నే అసహనానికి గురిచేసిన జగ్గుభాయ్ నటన, చివరికి షారుఖ్ నుంచే నుంచే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసను ఎలా అందుకుందో చూద్దాం.

Published on: May 12, 2026, 06:18:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jagapathi Babu Reveals Shah Rukh Khan Abusive Word: టాలీవుడ్‌లో డైరెక్టర్ కృష్ణవంశీ మార్కు సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. 1998లో ఆయన తెరకెక్కించిన 'అంతఃపురం' అలాంటి ఒక అద్భుత కావ్యం. అందులో 'సారాయి వీరరాజు' అనే చిల్లర దొంగ పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు ఒదిగిపోయి నటించారు.

జగపతి బాబుల నటించలేక బూతు తిట్టిన షారుఖ్ ఖాన్- ఆ బూతు మాటే అతిపెద్ద కాంప్లిమెంట్ అన్న జగ్గుభాయ్
జగపతి బాబుల నటించలేక బూతు తిట్టిన షారుఖ్ ఖాన్- ఆ బూతు మాటే అతిపెద్ద కాంప్లిమెంట్ అన్న జగ్గుభాయ్

ప్రాణాలనే అర్పించే పాత్ర

కేవలం డబ్బు కోసం సౌందర్యకు సహాయం చేయడానికి ఒప్పుకుని, చివరికి తన ప్రాణాలనే అర్పించే ఆ పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. సరిగ్గా ఇదే సినిమాను 2002లో హిందీలో 'శక్తి' (Shakti: The Power) పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో జగపతి బాబు చేసిన ఆ చారిత్రాత్మక పాత్రను హిందీలో బాలీవుడ్ బాద్‌‌షా షారుఖ్ ఖాన్ పోషించారు.

షారుఖ్ అసహనం.. జగపతికి ప్రశంస!

ఇటీవల హానెస్ట్ టౌన్‌హాల్ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జగపతిబాబు, ఆనాటి ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. 'అంతఃపురం' క్లైమాక్స్‌లో జగపతిబాబు ఒక స్మోకింగ్ షాట్, అలాగే డెత్ షాట్ చేశారు. దాన్ని హిందీ రీమేక్‌లో షారుఖ్ ఖాన్ రీక్రియేట్ చేయాల్సి వచ్చింది.

అయితే, జగ్గుభాయ్ చేసినంత సహజంగా ఆ షాట్ రాకపోవడంతో షారుఖ్ ఖాన్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారట. ఆ అసహనంలో షారుఖ్ ఖాన్ ఆఫ్ ది రికార్డ్‌గా జగపతిబాబు నటనను ఉద్దేశించి ఒక పరుష పదాన్ని (బూతు) వాడారట. "ఆయన నోటి నుంచి వచ్చిన ఆ బూతు మాట బయటకు చెప్పలేనిది. కానీ, నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద కాంప్లిమెంట్ మాత్రం అదే" అని జగపతి బాబు నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

కొన్నేళ్ల తర్వాత ఈ విషయం నిజమేనా అని షారుఖ్ ఖాన్‌ను అడిగితే.. "అవును, కానీ నేను కావాలని అనలేదు.. క్షమించు" అని బాద్‌షా అన్నాడట. దానికి జగ్గుభాయ్ స్పందిస్తూ.. "అది మీరు నాకు ఇచ్చిన గౌరవం సార్" అని బదులిచ్చారట.

సారాయి వీరరాజు: ఒక ఐకానిక్ క్యారెక్టర్

నిజానికి 'అంతఃపురం' సినిమాలో జగపతి బాబు పాత్ర నిడివి తక్కువే అయినా, ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. దొంగతనాలే లోకంగా బతికే ఒక వ్యక్తిలో మానవత్వం మేల్కొనడం, ఒక బిడ్డ కోసం తన జీవితాన్నే పణంగా పెట్టడం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. అదే ఎమోషన్‌ను బాలీవుడ్‌లో పండించడానికి షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజ నటుడే కష్టపడ్డారంటే, జగపతి బాబు నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగపతి బాబు @2026: రూపురేఖలు మారాయి!

ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జగపతి బాబు జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది 'జయమ్ము నిశ్చయమ్ము రా' అనే ఓటీటీ టాక్ షోతో బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఇప్పుడు వెండితెరపై మరింత శక్తిమంతంగా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న 'పెద్ది' (Peddi) సినిమాలో జగపతి బాబు లుక్ చూసి టాలీవుడ్ షాక్ అయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగ్గుభాయ్, ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

ఒకే పాత్ర- ఇద్దరు ధీరులు

ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి 'కింగ్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇలా ఇద్దరు అగ్ర నటులు తమ కెరీర్‌లో బిజీగా ఉన్నా, 'వీరరాజు' పాత్ర మాత్రం వారిద్దరినీ ఎప్పటికీ కలిపే ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'అంతఃపురం' సినిమా హిందీ రీమేక్ పేరు ఏమిటి?

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'అంతఃపురం' చిత్రాన్ని హిందీలో 'శక్తి: ది పవర్' (Shakti: The Power) పేరుతో రీమేక్ చేశారు.

2. జగపతి బాబు చేసిన ఏ పాత్రను షారుఖ్ ఖాన్ హిందీలో పోషించారు?

తెలుగులో జగపతి బాబు చేసిన 'సారాయి వీరరాజు' అనే ఐకానిక్ పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ (జై సింగ్ పేరుతో) పోషించారు.

3. జగపతి బాబు నటనపై షారుఖ్ చేసిన వ్యాఖ్య ఏమిటి?

జగపతిబాబు చేసిన ఒక స్మోకింగ్ సీన్ తనకు సరిగ్గా రాకపోవడంతో, షారుఖ్ అసహనంతో ఒక పరుష పదాన్ని వాడారు. అయితే దాన్ని జగపతి బాబు తన నటనకు దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తారు.

4. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?

జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమా 2026, జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More