Ranbir Kapoor: నెలకు 11 లక్షల అద్దె, వాస్తును లీజుకు తీసుకున్న రణ్‌బీర్ కపూర్- 250 కోట్ల బంగ్లాలో అలియా భట్‌తో కాపురం

Ranbir Kapoor Vastu Building Lease And Rent: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబైలోని తన పాత లగ్జరీ ఫ్లాట్‌ను భారీ ధరకు లీజుకు ఇచ్చారు. ఐదేళ్ల కాలపరిమితితో కుదుర్చుకున్న ఈ రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రామాయణం హీరోకు నెలకు రూ. 11 లక్షల అద్దె లభించడం విశేషంగా మారింది.

Published on: May 22, 2026, 11:35:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranbir Kapoor Vastu Building Lease And Rent: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒక సంచలన డీల్ కుదుర్చుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్‌, పాలి హిల్‌లో ఉన్న తన పాత అపార్ట్‌మెంట్‌ 'వాస్తు'ను ఆయన లీజుకు ఇచ్చారు. ఈ ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ. 11 లక్షల అద్దె లభించనుంది.

నెలకు 11 లక్షల అద్దె, వాస్తును లీజుకు తీసుకున్న రణ్‌బీర్ కపూర్- 250 కోట్ల బంగ్లాలో అలియా భట్‌తో కాపురం (File Photo )
నెలకు 11 లక్షల అద్దె, వాస్తును లీజుకు తీసుకున్న రణ్‌బీర్ కపూర్- 250 కోట్ల బంగ్లాలో అలియా భట్‌తో కాపురం (File Photo )

వాస్తు బిల్డింగ్‌లోని ఏడో అంతస్తులో

రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ముంబైలో సెలబ్రిటీల ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను ఈ ఒప్పందం మరోసారి నిరూపించింది. 'వాస్తు' బిల్డింగ్‌లోని ఏడో అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని రామాయణం హీరో రణ్‌బీర్ కపూర్ 2016లో రూ. 35 కోట్లకు కొనుగోలు చేశారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ఈ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆదిత్య శుక్లా అనే వ్యక్తి ఐదేళ్ల కాలపరిమితికి ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ. 45 లక్షల భారీ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది. ఈ లీజు అగ్రిమెంట్ మే 19, 2026న అధికారికంగా రిజిస్టర్ అయింది.

రూ. 250 కోట్ల పూర్వీకుల బంగళాలోకి కాపురం

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ దంపతులు తమ పాత ఫ్లాట్‌ను ఖాళీ చేసి, కొత్తగా ముస్తాబైన తమ పూర్వీకుల నివాసం 'కృష్ణ రాజ్' బంగళాలోకి కాపురం మార్చారు. ముంబై పాలి హిల్‌లోనే ఉన్న ఈ కోటీశ్వరుల ఇల్లు సుమారు రూ. 250 కోట్ల విలువైనదిగా అంచనా. షారుఖ్ ఖాన్ 'మన్నత్', అమితాబ్ బచ్చన్ 'జల్సా' సరసన నిలిచే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ హోమ్స్ జాబితాలో ఇది చేరింది.

రణ్‌బీర్ తాత కృష్ణ రాజ్ కపూర్ జ్ఞాపకార్థం ఈ బంగళాకు ఆ పేరు పెట్టారు. దాదాపు 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆస్తిని 1980లో రిషి కపూర్, నీతూ కపూర్ దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా సాగిన దీని పునర్నిర్మాణ పనులు 2025లో పూర్తయ్యాయి. 2020లో లుకేమియాతో కన్నుమూసిన దివంగత నటుడు రిషి కపూర్ జ్ఞాపకార్థం ఈ కొత్త ఇంట్లో ఒక ప్రత్యేకమైన గదిని కూడా రూపొందించారు.

అయోధ్యలో భూమి..

రణ్‌బీర్ కపూర్ పెట్టుబడులు కేవలం ముంబైకే పరిమితం కాలేదు. ఇటీవల ఆయన ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో కూడా ఒక లగ్జరీ ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' సంస్థకు చెందిన 'ది సరయూ' ప్రాజెక్టులో రూ. 3.31 కోట్లు వెచ్చించి 2,134 చదరపు అడుగుల భూమిని సొంతం చేసుకున్నారు.

సరయూ నదీ తీరంలో 75 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్టులో ప్రముఖ లీలా హోటల్స్ గ్రూప్ ఒక ఫైవ్ స్టార్ వెజిటేరియన్ లగ్జరీ హోటల్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నారు.

'రామాయణం' సినిమాతో బిజీ

దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆయన శ్రీరాముడిగా నటిస్తుండగా, టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి సీతగా చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తున్నారు. అటు రియల్ ఎస్టేట్ డీల్స్, ఇటు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో రణ్‌బీర్ కపూర్ కెరీర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More