Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ సొంతూరిలో జాతర.. రాక్‌స్టార్ మాస్ స్టెప్పులు.. ఎల్లమ్మ టీమ్ షేర్ చేసిన వీడియో చూశారా?
Devi Sri Prasad: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన స్వగ్రామం వెదురుపాకలో జరిగిన జాతరలో సందడి చేశారు. ఎల్లమ్మ జాతర స్ఫూర్తితోనే తాను కొత్త సినిమాకు ఓకే చెప్పానని చెబుతూ దిల్ రాజు, వేణు ఎల్దండి కాంబోలో రాబోతున్న 'ఎల్లమ్మ' మూవీకి అదిరిపోయే ట్రిబ్యూట్ ఇచ్చారు.
Devi Sri Prasad: తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రాక్‌స్టార్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు దేవిశ్రీ ప్రసాద్. తన మాస్ బీట్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే డీఎస్పీ.. తన మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. తాజాగా ఆయన తన తండ్రి పుట్టిన ఊరు వెదురుపాకలో జరిగిన జాతరలో పాల్గొన్నారు.

స్వచ్ఛమైన పల్లె వాతావరణం, అక్కడి జానపద కళలు, ఆ మట్టి వాసన తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని దేవిశ్రీ ప్రసాద్ ఒక ఆసక్తికరమైన వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
వీడియో షేర్ చేసిన ఎల్లమ్మ టీమ్
దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన మూలాల వైపు తిరిగి ప్రయాణించడం, ఆ పాత సంప్రదాయాలను మళ్లీ అనుభూతి చెందడం ఎంతో గొప్ప భావోద్వేగాన్ని ఇస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. చిన్నతనంలో తన తండ్రి చెన్నై నుంచి తమను తరచుగా ఈ వెదురుపాక గ్రామానికి తీసుకొచ్చేవారని, ఆ పల్లెటూరి స్వచ్ఛమైన గాలిని తాము ఆస్వాదించేవాళ్లమని డీఎస్పీ ఈ వీడియోలో గుర్తుచేసుకున్నారు.
"మా మూలాలతో, మా ప్రజలతో ఎప్పటికీ మమేకమై ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఊరిలో ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాం. ఈ గ్రామమే నాకు సంస్కృతి, జానపద కళలు, దైవత్వం అంటే ఏంటో నేర్పించింది. ఆ స్ఫూర్తితోనే నేను 'ఎల్లమ్మ' సినిమాకు పని చేయడానికి వెంటనే అంగీకరించాను" అని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.
జాతరలో మాస్ స్టెప్పులు
ఈ వీడియోలో డీఎస్పీ గ్రామస్తులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొనడం చూడవచ్చు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆయన వేసిన స్టెప్పులు, ఆ పల్లెటూరి కోలాహలం అంతా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.
దిల్ రాజు నిర్మాణంలో, బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. తరతరాలుగా భారతీయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులందరికీ 'ఎల్లమ్మ' టీమ్ తరఫున ఒక ఘనమైన నివాళిగా ఈ వీడియోను రూపొందించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
దేవిశ్రీ ప్రసాద్ స్వగ్రామం పేరు ఏమిటి?
ఆయన తండ్రి పుట్టిన ఊరు, డీఎస్పీకి ఎంతో ఇష్టమైన స్వగ్రామం పేరు వెదురుపాక.
తాజాగా డీఎస్పీ ఏ జాతరలో పాల్గొన్నారు?
తన స్వగ్రామం వెదురుపాకలో అంగరంగ వైభవంగా జరిగిన గ్రామదేవత జాతరలో ఆయన పాల్గొన్నారు.
'ఎల్లమ్మ' సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు?
దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'ఎల్లమ్మ' చిత్రానికి బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


